Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aryan Khan: షారుఖ్‌కు మరో షాక్ .. ఆర్యన్ ఖాన్‌‌కు దొరకని బెయిల్.. నిరాశలో అభిమానులు..

డ్రగ్స్ .. ఇప్పుడు ఈ మాట బాలీవుడ్ ను కుదిపేస్తోంది. ఇప్పటికే చాలా మంది ఈ కేసులో చిక్కుకొని ఎన్సీబీ అధికారులు చేస్తున్న విచారణలో పాల్గొంటున్నారు.

Aryan Khan: షారుఖ్‌కు మరో షాక్ .. ఆర్యన్ ఖాన్‌‌కు దొరకని బెయిల్.. నిరాశలో అభిమానులు..
Shah Rukh Khan's Son
Follow us
Rajeev Rayala

| Edited By: Ravi Kiran

Updated on: Oct 20, 2021 | 7:42 PM

Aryan Khan: డ్రగ్స్.. ఇప్పుడు ఈ మాట బాలీవుడ్‌ను కుదిపేస్తోంది. ఇప్పటికే చాలా మంది ఈ కేసులో చిక్కుకొని ఎన్సీబీ అధికారులు చేస్తున్న విచారణలో పాల్గొంటున్నారు. రీసెంట్‌గా బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ వినియోగిస్తూ అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే. ఆర్యన్ ఖాన్‌ను కార్డిలా క్రజ్‌లో అత్యున్నత స్థాయి రేవ్ పార్టీ నుండి అక్టోబర్ 2 న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అదుపులోకి తీసుకుంది. ఆర్యన్‌ను అక్టోబర్ 8 న ఆర్థర్ రోడ్ జైలులో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. న్యాయవాదులు పదేపదే ప్రయత్నించినప్పటికీ, ఆర్యన్ బెయిల్ పిటిషన్ పదేపదే తిరస్కరణకు గురవుతోంది. గోల్డెన్ స్పున్ తో పుట్టిన ఆర్యన్ చిన్నతనంనుంచి రాజభోగాలు అనుభవిస్తూ పెరిగాడు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ప్రస్తుతం అతడు జైలులో నరకయాతన అనుభవిస్తున్నాడు. ఆర్యన్ రోజు ఏడుస్తూనే ఉంటున్నాడని, సరిగ్గా తిండి కూడా తినడం లేదని తెలుస్తుంది. అతడు కేవలం బికెట్స్ నీటిలో ముంచుకొని తింటున్నాడట. ఇక కొడుకు జైలు  జీవితం అనుభవిస్తుండటంతో షారుఖ్ దంపతులు బయట కన్నీరు మున్నీరు అవుతున్నారు.

ఆర్యన్ అరెస్ట్ అయినప్పటి తల్లి గౌరీ ఖాన్ సరిగా ఆహారం కూడా తీసుకోవడం లేదట. సరిగా నిద్రపోవడం కూడా లేదని చెపుతున్నారు. ఎక్కువ సమయం దైవ ప్రార్థనలోనే ఉంటున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో నేడు (బుధ‌వారం) అత‌ని బెయిల్‌పై ప్ర‌త్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. ముంబైలోని సెషన్స్ కోర్టులో ఈరోజు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ వస్తుందని సీనియర్ న్యాయవాది మజీద్ మెమన్ ముందుగానే ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై నేడు ప్రత్యేక ఎన్‌డిపిఎస్ కోర్టు తీర్పు వెలువరించింది. మిగిలిన అన్ని బెయిల్ దరఖాస్తులలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ప్రత్యుత్తరాలను దాఖలు చేస్తుందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అద్వైత్ సేథ్నా జూనియర్ కోర్టుకు తెలియజేశారు. ఈక్రమంలో ఆర్యన్ ఖాన్ కు బెయిల్ దొరకలేదు. ఆర్యన్  బెయిల్‌ను కోర్ట్ నిరాకరించింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Amitabh Bachchan-Kriti Sanon: నీతో డ్యాన్స్‌ చేస్తుంటే నా కాలేజీ రోజులు గుర్తుకొస్తున్నాయి!

Radhe Shyam: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. పుట్టిన రోజు కానుకగా ‘రాధే శ్యామ్’ యూనిట్ స్పెషల్ గిఫ్ట్.. ఏమిటంటే

Ananya Nagalla: తన అందాలతో కుర్రకారు మనసులు దోచుకుంటున్న వకీల్ సాబ్ భామ అనన్య నాగల్ల