Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Radhe Shyam: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. పుట్టిన రోజు కానుకగా ‘రాధే శ్యామ్’ యూనిట్ స్పెషల్ గిఫ్ట్.. ఏమిటంటే

 Prabhas Radhe Shyam: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'రాధే శ్యామ్' చిత్ర యూనిట్ ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. ఎప్పటి నుంచో..

Radhe Shyam: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. పుట్టిన రోజు కానుకగా 'రాధే శ్యామ్' యూనిట్ స్పెషల్ గిఫ్ట్.. ఏమిటంటే
Prabhas Day
Follow us
Surya Kala

| Edited By: Rajeev Rayala

Updated on: Oct 20, 2021 | 3:48 PM

Prabhas Radhe Shyam: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘రాధే శ్యామ్’ చిత్ర యూనిట్ ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. ఎప్పటి నుంచో ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర బృందం కొత్త అప్డేట్ ని ఇచ్చింది. ప్రభాస్ పుట్టిన రోజు కానుకగా అభిమానులకు ‘రాధే శ్యామ్’ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రభాస్ తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. తన పుట్టిన రోజైన అక్టోబర్ 23 న రాధే శ్యామ్ టీజర్ విడుదల చేయనునట్లు ప్రకటించాడు. ఈ పోస్టుని గ్లోబల్ ప్రభాస్ డే అంటూ హ్యాష్ ట్యాగ్ ( #GlobalPrabhasDay) ని జోడించాడు.

2022 జనవరి 14 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమాలో ప్రభాస్, పూజా హెడ్గేలు జోడీగా నటించారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. దీంతో టీజర్‌ను ఇంగ్లీష్ తో పాటు బహు భాషల్లో రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ రంగం సిద్ధం చేసింది. ప్రభాస్ పుట్టిన రోజున విక్రమాదిత్య ఎవరు అనే విషయాన్నీ ప్రపంచానికి పరిచయం చేయడానికి రెడీ అయ్యారు.

రాధేశ్యామ్ సినిమా యూర‌ప్‌లోమిస్ అయిన ఓ ట్రైన్ ఆధారంగా తెరక్కిందనే టాక్ వినిపిస్తోంది. ప్రభాస్, పూజాహెడ్గే లు ప్రయాణిస్తున్న రైలు ఓ గుహలోకి వెళ్లి మాయమైపోయి.. వారిని 1979 బ్యాక్ డ్రాప్ లోకి తీసుకుని వెళ్తుందట. ఆ సమయంలో వీరి మధ్య పుట్టే ప్రేమతో రాధ్య శ్యామ్ పీరియాడిక‌ల్ స్టైల్లో ఉంటుంద‌ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ విషయాన్నీ టీజర్ లో రివీల్ చేస్తారా.. లేదా తెలియాలంటే అక్టోబర్ 23వరకూ ఆగాల్సిందే.. జిల్ ఫేం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరక్కుతున్న ఈ సినిమనుగోపికృష్ణ మూవీస్, యువి క్రియేషన్స్, టి-సిరీస్ బ్యానర్‌ లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి.

AlsoRead:  మాతా వైష్ణవి భక్తులకు తక్కువ ధరతో టూర్ ప్యాకేజీని అందిస్తోన్న ఐఆర్‌టీసీ.. పూర్తి వివరాలు మీకోసం..

ఉత్తరాఖండ్‌లో రికార్డ్ స్థాయిలో వర్షాలు.. 47 మంది మృతి.. తాజా పరిస్థితిపై ఆరాతీసిన ప్రధాని మోడీ