AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: నేను జీనియస్‌ అని ఇప్పుడు నమ్ముతున్నాను.. సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

జూనియర్‌ ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ప్రముఖ క్విజ్‌ ప్రోగ్రాం..'ఎవరు మీలో కోటీశ్వరులు'.

Samantha: నేను జీనియస్‌ అని ఇప్పుడు నమ్ముతున్నాను.. సమంత ఆసక్తికర వ్యాఖ్యలు
Samantha
Basha Shek
| Edited By: Janardhan Veluru|

Updated on: Oct 20, 2021 | 2:44 PM

Share

జూనియర్‌ ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ప్రముఖ క్విజ్‌ ప్రోగ్రాం..’ఎవరు మీలో కోటీశ్వరులు’. హిందీ ‘కేబీసీ’ మాదిరిగానే తెలుగులోనూ పలువురు సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. దసరా సందర్భంగా ఇటీవల స్టార్‌ హీరోయిన్‌ సమంత ఈ టీవీ షోకు హాజరైంది. చైతూతో విడాకుల తర్వాత సమంత ఎక్కువగా బయటకు రాలేదు. దీంతో సహజంగానే అందరికీ ఈ ఎపిసోడ్‌పై ఆసక్తి ఏర్పడింది. అందుకు తగ్గట్టుగానే ఎన్టీఆర్‌తో కలిసి షోలో ఎంతో సందడి చేసింది సామ్‌. క్విజ్‌లో భాగంగా ‘ఛాంప్స్‌ ఎలీసే మార్గంలో నడిచి, ఏ నగరంలో ఆర్క్‌ డి ట్రియోంఫ్‌ని చూడవచ్చు’ అన్న ప్రశ్నను సంధించారు ఎన్టీఆర్‌. అయితే దీనికి సరైన సమాధానం గుర్తించలేకపోయిన సమంత 50:50 ఆప్షన్స్‌కు వెళ్లింది. అందులో ‘ప్యారిస్‌’ అనే ఆప్షన్‌ ఎంచుకోగా ఎన్టీఆర్‌, ప్రేక్షకులు మొత్తం సైలెంట్‌ అయ్యారు. దీంతో మరింత టెన్షన్‌ పడిపోయిన సామ్‌ను సరదాగా ఆటపట్టించారు ఎన్టీఆర్‌. ‘ప్యారిస్‌ వెళ్తే ఎంతసేపూ షాపింగ్‌ చేయడం, ఐఫిల్‌ టవర్‌ చూసేసి, బాగా బ్యాగులు కొని తెచ్చుకోవడమేనా?’ అని అనడంతో సమంత ముఖంలో నవ్వులు వెల్లివిరిశాయి. ఆ వెంటనే ‘ప్యారిస్‌’ కరెక్ట్‌ ఆన్సర్‌ అని చెప్పడంతో మరింత సంబరపడిపోయింది. ఈ ప్రశ్నతో రూ.1.60లక్షలు గెల్చుకుందీ అందాల తార.

నేను జీనియస్‌ అని ఇప్పుడ నమ్ముతున్నాను! ఇక రూ.25లక్షల ప్రశ్నగా ‘సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన శశిథరూర్‌ ‘యాస్‌ ఎరా ఆఫ్‌ డార్క్‌నెస్‌’ అనే పుస్తకం దేని గురించి రాయబడింది’ అన్న దానికి ‘బ్రిటిష్‌ పరిపాలన’ అని సరైన సమాధానం ఎంచుకుని తెగ ఆనందపడిపోయింది సామ్‌. ‘ నేను జీనియస్‌ అని మా ఎప్పుడూ నాతో చెప్పేది. కానీ నేను నమ్మేదాన్ని కాదు. ఇప్పుడు నమ్ముతున్నాను’ అని చెప్పుకొచ్చింది. ఆ వెంటనే ఎన్టీఆర్‌ ‘ నువ్వు జీనియస్‌ అని, మీ అమ్మగారు నమ్మారు. నేనూ నిరూపించాను. నీకు సహాయం చేసినందుకు కృతజ్ఞతగా నా కాళ్లకు నమస్కారం పెట్టడం, నా ఫొటో ఇంట్లో పెట్టుకుని పూజలు చేయడం లాంటివి మాత్రం చేయద్దు’ అని వ్యాఖ్యానించడంతో షో అంతా ఒక్కసారిగా నవ్వులతో నిండిపోయింది.

Also Read: Ananya Nagalla: తన అందాలతో కుర్రకారు మనసులు దోచుకుంటున్న వకీల్ సాబ్ భామ అనన్య నాగల్ల

Childhood Pic: తాతగారితో గారాల మనవడు ఈ చిన్నారి బాలుడు.. ఆంధ్రుల అభిమాన నటుడు ఎవరో గుర్తు పట్టారా..

Manchu Manoj: ‘సార్’ అంటూనే వర్మకు సాలిడ్ కౌంటర్ ఇచ్చిన మంచు మనోజ్..