AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manchu Manoj: ‘సార్’ అంటూనే వర్మకు సాలిడ్ కౌంటర్ ఇచ్చిన మంచు మనోజ్..

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)లో ప్రస్తుతం ఎటువంటి పరిణామాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫలితాల అనంతరం కూడా అదే హీట్ కొనసాగుతోంది.

Manchu Manoj: 'సార్' అంటూనే వర్మకు సాలిడ్ కౌంటర్ ఇచ్చిన మంచు మనోజ్..
Rgv Manchu Manoj
Ram Naramaneni
|

Updated on: Oct 20, 2021 | 10:16 AM

Share

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)లో ప్రస్తుతం ఎటువంటి పరిణామాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నికలకు నెల రోజుల ముందు నుంచి స్టార్టయిన రచ్చ.. ఎన్నికల ముగిశాక కూడా కొనసాగుతోంది. ఎన్నికలకు సంబంధించి రోజుకో అంశం తెరపైకి వస్తోంది. అధ్యక్షుడిగా గెలిచిన మంచు విష్ణు ప్యానల్‌కు, ఓటమి పాలయిన ప్రకాశ్ రాజ్ ప్యానల్‌కు మధ్య మాటల యుద్దం కొనసాగుతూనే ఉంది. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, తమ సభ్యులపై దాడులకు పాల్పడ్డారని ప్రకాశ్ రాజ్ ప్యానల్ ఆరోపిస్తోంది. ఎన్నికల రోజు సీసీ ఫుటేజ్ కోరుతోంది.  తాము ప్రజాస్వామ్య పద్దతిలోనే గెలిచామని, ప్రకాశ్‌ రాజ్‌ ఆరోపణలు అన్ని అర్థరహితమని  మంచు విష్ణు ప్యానల్ చెబుతోంది. కాగా ‘మా’ పరిణామాలపై ఇటీవల దర్శకుడు ఆర్జీవీ తన మార్క్ ట్వీట్ వేశారు.  మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌  ఓ సర్కస్ అని, అందులో ఉండే సభ్యులంతా జోకర్లు అంటూ బాంబు పేల్చారు ఆర్జీవీ.

అయితే వర్మ గురించి తెలుసు కాబట్టి.. అందరూ లైట్ తీసుకున్నారు. అయితే ఆయన వేసిన ట్వీట్ మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పలువురు వర్మను సమర్థిస్తుండగా.. మరికొందరు విమర్శిస్తున్నారు. తాజాగా సీన్‌లోకి మంచు మనోజ్ ఎంటరయ్యారు. వర్మ ట్వీట్‌కు కాస్త ఘాటైన రిప్లై ఇచ్చారు. ‘మా’ ఒక సర్కస్ అయితే… మీరు రింగ్ మాస్టర్ సర్ అంటూ ట్వీట్ చేశాడు.

మాములుగా తన జోలికి రానివారిపైనే సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో పంచ్‌లు విసురుతారు వర్మ. అదే విధంగా తనపై కూడా ఎవరికున్న అభిప్రాయాలు వారు చెప్పొచ్చు అంటారు. ఈ క్రమంలో మనోజ్ కామెంట్‌కు ఏమైనా రిప్లై ఇస్తారా.. లేదా లైట్ తీసుకుంటారా అన్నది తెలియాలంటే కాస్త వెయిట్ చెయ్యాలి.

Also Read: సజ్జనార్ మార్క్.. నేటి నుంచి ఆ బస్టాండ్​లలో యూపీఐ, క్యూఆర్​ కోడ్​లతో నగదు చెల్లింపులు

Follow Us
భారీ బ్యాటరీ, ఐపీ68 రేటింగ్‌తో మార్కెట్లోకి వివో Y31T! వివరాలివే
భారీ బ్యాటరీ, ఐపీ68 రేటింగ్‌తో మార్కెట్లోకి వివో Y31T! వివరాలివే
ఒకే ఇన్నింగ్స్‌లో 451 పరుగులు.. ప్రపంచ రికార్డ్‌నే షేక్ చేశారుగా
ఒకే ఇన్నింగ్స్‌లో 451 పరుగులు.. ప్రపంచ రికార్డ్‌నే షేక్ చేశారుగా
రూ.998 ధరతో మార్కెట్లోకి బ్లెండ్‌లైఫ్ జోష్ పోర్టబుల్ బ్లెండర్
రూ.998 ధరతో మార్కెట్లోకి బ్లెండ్‌లైఫ్ జోష్ పోర్టబుల్ బ్లెండర్
మళ్లీ షాకిస్తున్న బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతంటే
మళ్లీ షాకిస్తున్న బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతంటే
మార్కెట్‌లోకి షియోమీ మిక్స్ ఫోల్డ్ 5.. ఫీచర్లు ఇవే
మార్కెట్‌లోకి షియోమీ మిక్స్ ఫోల్డ్ 5.. ఫీచర్లు ఇవే
ఓటీటీలో గుండెల్ని పిండేసే లవ్ స్టోరీ.. తెలుగుతో సహా 5 భాషల్లో..
ఓటీటీలో గుండెల్ని పిండేసే లవ్ స్టోరీ.. తెలుగుతో సహా 5 భాషల్లో..
అప్పట్లో రోజుకు రూ.3 కూలీ.. ఇప్పుడు రూ.160 కోట్ల కంపెనీకి ఓనర్!
అప్పట్లో రోజుకు రూ.3 కూలీ.. ఇప్పుడు రూ.160 కోట్ల కంపెనీకి ఓనర్!
రెండు తింటే ఇమ్యూనిటీ డబుల్ చేసి డయాబెటిస్, కొలెస్ట్రాల్‌ మాయం
రెండు తింటే ఇమ్యూనిటీ డబుల్ చేసి డయాబెటిస్, కొలెస్ట్రాల్‌ మాయం
ఆగస్టు 18 రాశిఫలాలు: ఆ రాశులకు చెందిన నిరుద్యోగులకు మంచి ఆఫర్..
ఆగస్టు 18 రాశిఫలాలు: ఆ రాశులకు చెందిన నిరుద్యోగులకు మంచి ఆఫర్..
యూజర్లకు గుడ్‌న్యూస్‌.. జియో ప్రైమ్‌ రీఎంట్రీ.. ఏడాది పాటు..
యూజర్లకు గుడ్‌న్యూస్‌.. జియో ప్రైమ్‌ రీఎంట్రీ.. ఏడాది పాటు..