TSRTC: సజ్జనార్ మార్క్.. నేటి నుంచి ఆ బస్టాండ్​లలో యూపీఐ, క్యూఆర్​ కోడ్​లతో నగదు చెల్లింపులు

ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి సజ్జనార్ తన మార్క్ చూపిస్తున్నారు. ఇప్పటికే  అప్పుడప్పుడు బస్సుల్లో ప్రయాణిస్తూ.. ప్రయాణీకుల సమస్యలు తెలుసుకుంటున్నారు.

TSRTC: సజ్జనార్ మార్క్.. నేటి నుంచి ఆ బస్టాండ్​లలో యూపీఐ, క్యూఆర్​ కోడ్​లతో నగదు చెల్లింపులు
Tsrtc
Follow us

|

Updated on: Oct 20, 2021 | 7:43 AM

ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి సజ్జనార్ తన మార్క్ చూపిస్తున్నారు. ఇప్పటికే  అప్పుడప్పుడు బస్సుల్లో ప్రయాణిస్తూ.. ప్రయాణీకుల సమస్యలు తెలుసుకుంటున్నారు. పలు ప్రాంతాల్లో ఆకస్మిక పర్యటనలు చేస్తున్నారు. బస్టాండ్ల‌లో ప్రయాణీకుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తోన్న స్టాల్స్, క్యాంటిన్లపై చర్యలు తీసుకుంటున్నారు. దసరా పండుగ సందర్భంగా బస్సులకు అధిక ఛార్జీలు లేకుండా చూసి.. ప్రశంసలు అందుకున్నారు. అదే బాటలో తాజాగా  తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో గుడ్‌న్యూస్ చెప్పారు. డబ్బు చెల్లింపులతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికుల కోసం నేటి నుంచి కొన్ని బస్టాండ్​లలో యూపీఐ, క్యూఆర్ కోడ్ చెల్లింపు సేవలను ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

ప్రయాణికుల నుంచి యూపీఐ, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు స్వీకరించేందుకు పైలట్ ప్రాజెక్ట్​ను స్టార్ట్ చేసినట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ తెలిపారు. మహాత్మాగాంధీ బస్​స్టేషన్(ఎంజీబీఎస్)లోని టికెట్ రిజర్వేషన్ కౌంటర్, పార్శిల్-కార్గో కేంద్రం, సికింద్రాబాద్​లోని రేతిఫైల్ బస్​పాస్ కౌంటర్​లలో యూపీఐ, క్యూఆర్ కోడ్ సేవలను పాసింజర్స్ వినియోగించుకునే వెసులుబాటు కలిగించామన్నారు. ప్రయాణికులు ఈ సర్వీసులను సద్వినియోగం చేసుకుని.. తమ అభిప్రాయాలు, సూచనలు ట్విట్టర్ ద్వారా తెలియజేయాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రయాణికులకు సూచించారు.