Amitabh Bachchan-Kriti Sanon: నీతో డ్యాన్స్‌ చేస్తుంటే నా కాలేజీ రోజులు గుర్తుకొస్తున్నాయి!

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న 'కౌన్‌ బనేగా కరోడ్‌ పతి' కి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సామాన్యులను సైతం లక్షాధికారులు..

Amitabh Bachchan-Kriti Sanon: నీతో డ్యాన్స్‌ చేస్తుంటే నా కాలేజీ రోజులు గుర్తుకొస్తున్నాయి!
Amitabh And Kritisanon 2
Follow us
Basha Shek

|

Updated on: Oct 20, 2021 | 1:40 PM

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ‘కౌన్‌ బనేగా కరోడ్‌ పతి’ కి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సామాన్యులను సైతం లక్షాధికారులు, కోటీశ్వరులుగా మార్చే ఈ క్విజ్‌ ప్రోగ్రాం ఎంటర్‌టైన్‌మెంట్ అందించడంలోనూ ముందే ఉంటుంది. ఇందులో భాగంగా వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలను టీవీ షోకు ఆహ్వానించి టీవీ షోను మరింత ఆసక్తిగా మలుస్తున్నారు అమితాబ్‌. ఇటీవల జెనీలియా-రితేశ్‌ దేశ్‌ముఖ్‌ దంపతులు ఈ కార్యక్రమానికి హాజరై తమ జీవితానికి సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ బాలీవుడ్‌ నటి కృతి సనన్‌ ఈ టీవీషోకు ముఖ్య అతిథిగా హాజరైంది. తన తాజా చిత్రం ‘ హమ్‌ దో హమారే దో’ ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్‌లో భాగంగా కేబీసీ కార్యక్రమానికి హాజరైంది. షోలో భాగంగా ఎర్రటి పొడవైన గౌన్‌లో స్టేజీ మీదకు వచ్చిన ఈ అందాల తార బిగ్‌బీ తో కలిసి బాల్‌ రూమ్‌ డ్యాన్స్‌ చేసి ఆకట్టుకుంది.

నా కాలేజీ రోజులు గుర్తుకొస్తున్నాయి! ఈ సందర్భంగా తమ డ్యాన్స్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నారు అమితాబ్‌, కృతి. ‘కృతి నీతో బాల్‌ రూమ్‌ డ్యాన్స్‌ చేస్తుంటే నా కాలేజీ రోజులు, అదేవిధంగా కోలకతాలో గడిపిన క్షణాలు గుర్తుకొస్తున్నాయి ‘ అని అమితాబ్‌ వ్యాఖ్యానించారు. ఇదే ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకున్న కృతి ‘చిన్నప్పటి నుంచి ఈ షో చూస్తున్నాను. అలాంటిది ఇప్పుడు ఆ షోకు అతిథిగా హాజరవ్వడం, అమితాబ్‌ గారితో డ్యాన్స్‌ చేయడం నా జీవితంలో మర్చిపోలేను’ అని హర్షం వ్యక్తం చేసింది. ప్రస్తుతం అమితాబ్-కృతి డ్యాన్స్‌కు సంబంధించిన ఫొటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.

Also Read:  Radhe Shyam: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. పుట్టిన రోజు కానుకగా ‘రాధే శ్యామ్’ యూనిట్ స్పెషల్ గిఫ్ట్.. ఏమిటంటే

Samantha – Jr. NTR: నేను జీనియస్‌ అని ఇప్పుడు నమ్ముతున్నాను!

Ananya Nagalla: తన అందాలతో కుర్రకారు మనసులు దోచుకుంటున్న వకీల్ సాబ్ భామ అనన్య నాగల్ల

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..