Viral Video: నిర్లక్ష్యంగా నడిస్తే తప్పదు భారీ మూల్యం.. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది..
మనం ఎక్కడున్నా అప్రమత్తంగా ఉండాలి.. ముఖ్యంగా రోడ్డుపై నడిచేటప్పుడు. మనతో పిల్లిల్ని తీసుకెళ్లినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఓ మహిళ ఇలానే నిర్లక్ష్యంగా నడిచి మ్యాన్ హోల్లో పడింది...
మనం ఎక్కడున్నా అప్రమత్తంగా ఉండాలి.. ముఖ్యంగా రోడ్డుపై నడిచేటప్పుడు. మనతో పిల్లిల్ని తీసుకెళ్లినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఓ మహిళ ఇలానే నిర్లక్ష్యంగా నడిచి మ్యాన్ హోల్లో పడింది. ఇక్కడ మున్సిపల్ అధికారుల తప్పిందం కూడా ఉందనుకోండి. ఢిల్లీలోని ఫరీదాబాద్ జవహర్ కాలనీలో ఓ మహిళ తన బిడ్డను ఎత్తుకుని నడుస్తూ ఫోన్ మాట్లాడుతుండగా ఓపెన్ మ్యాన్‌హోల్‌లో పడిపోయింది. అక్కడే ఉన్న కొందరు మహిళ మ్యాన్‌హోల్‌లో పడటం చూసి అక్కడి చేరుకుని ఆమెతోపాటు బిడ్డను రక్షించారు. అయితే ఈ ఘటనలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన దృశ్యాలు ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డయింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
చాలా మంది రోడ్డుపై నటిచేటప్పుడు, రోడ్డు దాటుతున్నప్పుడు ఫోన్ మాట్లాడుతుంటారు. కొందరు హెడ్‌ఫోన్స్ పెట్టుకుని ప్రపంచం తెలియకుండా నడుస్తారు. ఇదీ ఎప్పటికైనా మంచిది కాదని ఈ ఘటన మరోసారి నిరూపించింది. ఈ ఘటనలో ఆమె తప్పిదంతోపాటు మున్సిపల్ అధికారులు తప్పిదం కూడా ఉంది. మ్యాన్ హోల్‌ను ఓపెన్‌గా పెట్టడం.. అలా ఓపెన్‌గా పెట్టిన చుట్టు ఎదైనా కంచె వేస్తే ఈ ప్రమాదం తప్పేది. ఎందులోనైనా నిర్లక్ష్యం చేస్తే తప్పుదు భారీ మూల్యం..
Alert: A woman and her child was rescued within minutes after falling into an open manhole in Faridabad’s Jawahar colony. Residents are alleging negligence of Municipal Corporation of Faridabad @HindustanTimes@HTGurgaon pic.twitter.com/2YYbWkzWnp
— Dr. Leena Dhankhar (@leenadhankhar) October 15, 2021
Read Also.. Viral: కడుపు నొప్పితో ఆసుపత్రికి వచ్చాడు.. స్కాన్ చేసిన డాక్టర్లకు ఫ్యూజులు ఔట్.. అసలేమైందంటే!