వాహనాలపై ఆ స్టిక్కర్లు అతికించారా.. అక్కడి పోలీసుల కొత్త రూల్‌ తెలిస్తే షాకవుతారు..!

Mumbai Police: ముంబై పోలీసులు కొత్త ఆర్డర్ తీసుకొచ్చారు. దీని ప్రకారం.. ఇక నుంచి ముంబై పోలీసు శాఖలో పనిచేసే ఏ పోలీసైనా తన వ్యక్తిగత కారు లేదా టూ వీలర్‌పై 'ముంబై పోలీస్'

వాహనాలపై ఆ స్టిక్కర్లు అతికించారా.. అక్కడి పోలీసుల కొత్త రూల్‌ తెలిస్తే షాకవుతారు..!
Mumbai Polices
Follow us

|

Updated on: Mar 17, 2022 | 6:11 AM

Mumbai Police: ముంబై పోలీసులు కొత్త ఆర్డర్ తీసుకొచ్చారు. దీని ప్రకారం.. ఇక నుంచి ముంబై పోలీసు శాఖలో పనిచేసే ఏ పోలీసైనా తన వ్యక్తిగత కారు లేదా టూ వీలర్‌పై ‘ముంబై పోలీస్’ అని స్టిక్కర్ అంటించకూడదు. ‘పోలీస్’ అని రాయకూడదు. కేవలం ముంబై పోలీసు శాఖకి చెందిన వాహనాలకు మాత్రమే ‘పోలీస్‌’ అని రాసి ఉండాలని ప్రకటించారు. భారతదేశంలో నివసించే పౌరులందరు చట్టాలని గౌరవించాలని ఇందులో ఎవ్వరికి కూడా మినహాయింపు ఉండదని అందరు సమానమే అని చెప్పడానికే ఈ ఆర్డర్‌ తీసుకొచ్చినట్లు తెలిపారు. పోలీస్‌ అని రాసి ఉంటే వాహనాలని ఆపకూడదని ఎక్కడా లేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మన దేశంలో వాహనాలపై పోలీసు అని మాత్రమే కాకుండా ప్రెస్, లాయర్‌, కులాల పేర్లు రాసే ఫ్యాషన్ ఎక్కువగా ఉంది. మీరు ఇలాంటి వాహనాలని తరచు రోజు చూస్తూ ఉంటారు. కారు గ్లాస్‌పై కులం లేదా వృత్తి పేరు రాసి ఉంటే అందరు తమను గౌరవంగా చూస్తారని, తమ వాహనాలను ఎవరూ ఆపరని ప్రజలు భావిస్తున్నారు. కానీ ఇది ఒక మానసిక వ్యాధి అని, దానికి చికిత్స చాలా ముఖ్యమైనదని అందుకోసమే ఈ ఆర్డర్ తీసుకొచ్చామని ముంబై పోలీసులు తెలిపారు.

ఒక పోలీస్‌ ట్రాఫిక్ రూల్స్‌ని ఉల్లంఘిస్తే సామాన్యులకు విధించే జరిమానా కంటే రెట్టింపు జరిమానా చెల్లించాలి. అంటే హెల్మెట్ పెట్టుకోనందుకు సామాన్యుడు వెయ్యి రూపాయల జరిమానా చెల్లించినట్లయితే ఒక పోలీసు రూల్స్‌ పాటించనందుకు రెండు వేల రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ఒక పోలీస్‌ మరొక పోలీస్‌ వాహనాన్ని ఆపినప్పుడు తనకు చలాన్ వేయకూడదని వాహనాలపై పోలీస్‌ అని స్టిక్కర్ అతికిస్తారు. కానీ ముంబైలో ఇప్పుడు కొత్త రూల్‌ ప్రకారం అది జరగదు. ఏ పోలీసు కూడా తన ప్రైవేట్ వాహనంపై పోలీసు స్టిక్కర్‌ను అంటించకూడదని సర్క్యులర్ జారీ చేశారు. ఎవరైనా ఈ నిబంధనను ఉల్లంఘిస్తే వారిపై ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కేసు నమోదు చేయడంతో పాటు శాఖాపరమైన చర్యలు తీసుకుంటారు. అయితే చాలామంది సాధారణ ప్రజలు ఈ రూల్‌ దేశం మొత్తం తీసుకురావాలని కోరుతున్నారు.

Kaloji University: వైద్య విద్యార్థులకు గమనిక.. కాళోజీ యూనివర్సిటీ నుంచి యాజమాన్య కోట్ల సీట్ల భర్తీకి నోటిఫికేషన్

Russia Ukraine War: ఉక్రెయిన్‌పై సైనిక ఆపరేషన్ నిలిపివేయండి.. రష్యాకి ఆదేశాలు జారీ చేసిన అంతర్జాతీయ కోర్టు..

Health News: ఇప్పటి నుంచి చేతులతో ఆహారం తినండి.. చెప్పులు లేకుండా నడవండి.. ఎందుకంటే..?

మీరు ఇప్పుడే ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయాలా?
మీరు ఇప్పుడే ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయాలా?
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
రుద్రాణి ప్లాన్ సక్సెస్.. అప్పూ, కళ్యాణ్‌లు జైలుకు.. పాపం అనామిక!
రుద్రాణి ప్లాన్ సక్సెస్.. అప్పూ, కళ్యాణ్‌లు జైలుకు.. పాపం అనామిక!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
చేదు రోజులు గుర్తుచేసుకున్న బిగ్‏బాస్ కీర్తి..
చేదు రోజులు గుర్తుచేసుకున్న బిగ్‏బాస్ కీర్తి..
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
రాజస్థాన్ దండయాత్రను లక్నో అడ్డుకునేనా.. రికార్డులు ఎలా ఉన్నాయంటే
రాజస్థాన్ దండయాత్రను లక్నో అడ్డుకునేనా.. రికార్డులు ఎలా ఉన్నాయంటే
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
నాగమణి చెంత ఉంటే అతీత శక్తులు వస్తాయా..? నిజం ఇదే...
నాగమణి చెంత ఉంటే అతీత శక్తులు వస్తాయా..? నిజం ఇదే...
వయసు ఒక నెంబర్ మాత్రమే.. 60 ఏళ్ల వయసులో అందాల సుందరి కిరీటం
వయసు ఒక నెంబర్ మాత్రమే.. 60 ఏళ్ల వయసులో అందాల సుందరి కిరీటం