AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine War: ఉక్రెయిన్‌పై సైనిక ఆపరేషన్ నిలిపివేయండి.. రష్యాకి ఆదేశాలు జారీ చేసిన అంతర్జాతీయ కోర్టు..

Russia Ukraine War: ఉక్రెయిన్‌తో పాటు ప్రపంచ దేశాలకు భారీ ఊరటనిస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) రష్యాకి కీలక ఆదేశాలు జారీ చేసింది.

Russia Ukraine War: ఉక్రెయిన్‌పై సైనిక ఆపరేషన్ నిలిపివేయండి.. రష్యాకి ఆదేశాలు జారీ చేసిన అంతర్జాతీయ కోర్టు..
Russia Ukraine War
uppula Raju
|

Updated on: Mar 16, 2022 | 10:45 PM

Share

Russia Ukraine War: ఉక్రెయిన్‌తో పాటు ప్రపంచ దేశాలకు భారీ ఊరటనిస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) రష్యాకి కీలక ఆదేశాలు జారీ చేసింది. వెంటనే ఉక్రెయిన్‌పై సైనిక ఆపరేషన్‌ను వెంటనే నిలిపివేయాలని సూచించింది. ఉక్రెయిన్ భూభాగం నుంచి బలగాలని ఉపసంహరించుకోవాలని ఆదేశించింది. ఇప్పటి నుంచి ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడికి పాల్పడవద్దని హెచ్చరించింది. ఈ తీర్పుపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆనందం వ్యక్తం చేశాడు. రష్యాపై అంతర్జాతీయ న్యాయస్థానంలో వేసిన కేసులో తమ దేశం పూర్తిగా విజయం సాధించిందని పేర్కొన్నాడు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని వెలిబుచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ కోర్టు తీర్పునకు రష్యా కట్టుబడి ఉండాలని లేదంటే ప్రపంచ దేశాల ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని, అంతేకాకుండా ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తుందని తెలిపాడు. ఇదిలా ఉంటే అంతకు ముందు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అమెరికా పార్లమెంట్‌ ఉభయ సభలనుద్దేశించి వర్చువల్‌గా మాట్లాడారు. 9/11 దాడులతో పాటు 1941 డిసెంబర్‌లో పెరల్‌ హార్బర్‌లో జరిగిన బాంబు దాడుల్ని గుర్తుచేశారు. గత మూడు వారాలుగా ఉక్రెయిన్‌లో ప్రతి రోజూ అవే దాడులు జరుగతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పోరాటం కేవలం ఉక్రెయిన్‌ని మాత్రమే కాపాడుకొనేందుకు కాదనీ.. యూరప్‌, ప్రపంచ విలువల కోసం కూడా పోరాటం చేస్తున్నామని తెలిపారు.

అంతకు ముందు రష్యా, అమెరికాల మధ్య ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాక్‌ సులివాన్‌, రష్యా భద్రతా మండలి కార్యదర్శి జనరల్‌ నొకోలాయ్‌ పట్రుషెవ్‌ మధ్య యుద్దానికి సంబంధించిన చర్చలు జరిగాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు జాక్‌ మీడియాకి తెలిపారు. వెంటనే రష్యా ఉక్రెయిన్‌ నగరాలు, పట్టణాలపై దాడులు మానుకోవాలని సూచించినట్టు తెలిపింది.

Harbhajan Singh: మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ బంపర్ ఆఫర్.. రాజ్యసభకు పంపించే ఛాన్స్?

NMDC Recruitment: హైదరాబాద్‌ ఎన్‌ఎండీసీలో ఉద్యోగాలు.. దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే..

Viral Video: ఒయ్యారాలు పోతూ.. మనిషిలా రెండు కాళ్లతో నడుస్తున్న కుక్క.. నెట్టింట్లో వైరల్