AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eiffel Tower: మరింత ఎత్తు పెరిగిన ఈఫిల్ టవర్.. కారణమేంటంటే

ప్రపంచ ప్రఖ్యాత కట్టడం ఈఫిల్ టవర్ ఎత్తు పెరుగుతోందట. వినడానికి ఆశ్చర్యంగా అనిపిస్తున్నా ఇది నిజ్జంగా నిజం. ప్రపంచంలోనే ఎత్తైన కళాఖండంగా ఏటా లక్షల మంది పర్యాటకులను ఆకర్షిస్తోంది ఈఫిల్‌ టవర్‌...

Eiffel Tower: మరింత ఎత్తు పెరిగిన ఈఫిల్ టవర్.. కారణమేంటంటే
Eifil Tower 2
Ganesh Mudavath
|

Updated on: Mar 16, 2022 | 9:25 PM

Share

ప్రపంచ ప్రఖ్యాత కట్టడం ఈఫిల్ టవర్ ఎత్తు పెరుగుతోందట. వినడానికి ఆశ్చర్యంగా అనిపిస్తున్నా ఇది నిజ్జంగా నిజం. ప్రపంచంలోనే ఎత్తైన కళాఖండంగా ఏటా లక్షల మంది పర్యాటకులను ఆకర్షిస్తోంది ఈఫిల్‌ టవర్‌ (Eiffel Tower). ఈ టవర్‌ ఎత్తు 324 మీటర్లు. తాజాగా టవర్‌ చివరి భాగంలో కొత్తగా దాదాపు ఆరు మీటర్ల డిజిటల్‌ రేడియో యాంటెన్నాను(Antenna) అమర్చారు. దీంతో ఈఫిల్‌ టవర్‌ ఎత్తు 330 మీటర్లకు పెరిగినట్లు అయ్యింది. 130 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ టవర్‌ను తొలుత ఓ అంతర్జాతీయ ప్రదర్శన సందర్భంగా ఏర్పాటు చేశారు. మొదట్లో దీన్ని తాత్కాలికంగానే ఉంచాలని అనుకున్నప్పటికీ శతాబ్దానికిపైగా ప్రపంచ పర్యాటకుల(Tourist) ఆకర్షణతో శాశ్వతంగా విరాజిల్లుతోంది. మరోవైపు టవర్‌ పైభాగంలో యాంటెన్నాలను అమర్చి ప్రసారాల కోసమూ ఉపయోగిస్తున్నారు. ఇలా యాంటెన్నా మార్చిన ప్రతిసారి టవర్‌ ఎత్తు స్వల్పంగా మారుతోంది.

తాజాగా హెలికాప్టర్‌ సహాయంతో టవర్‌ చివరి భాగంలో కొత్త యాంటెనాను కేవలం 10 నిమిషాల్లోనే అమర్చారు. దీంతో ఈఫిల్‌ టవర్‌ ఎత్తు ఆరు మీటర్లు పెరిగి 330 మీటర్లకు చేరింది. ఇదిలా ఉంటే, ప్రపంచంలోనే అతి ఎత్తైన ఈ ఐరన్‌ టవర్‌ను 1889లో నిర్మించారు. 1887 జనవరి 28న ప్రారంభమైన టవర్‌ నిర్మాణం 1889 మార్చి 15 నాటికి పూర్తయ్యింది. ‘గుస్తావ ఐఫిల్‌’కి చెందిన ఫ్రెంచ్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ సంస్థ దీన్ని రూపొందించింది. ఆయన పేరు మీదే దీనికి ఐఫిల్‌ అనే పేరు వచ్చినప్పటికీ.. ప్రస్తుతం ఇది ఈఫిల్‌ టవర్‌గా మారిపోయింది.

ఇవీచదవండి.

Holi 2022: రేపు హోలికా దహనం.. శుభ సమయం, పూజా విధానం.. కలిగే ఫలితాలు పూర్తి వివరాలు

Heart: భోజనం చేసిన తర్వాత ఈ పని చేస్తే.. మీ గుండెతో పాటు మీరూ బాగుంటారు..

WTC Points Table: డ్రాగా ముగిసిన రెండో టెస్ట్.. అయినా టాప్ ప్లేస్‌లోనే పాక్, ఆసీస్ జట్లు.. టీమిండియా స్థానం ఎక్కడంటే?