AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC Points Table: డ్రాగా ముగిసిన రెండో టెస్ట్.. అయినా టాప్ ప్లేస్‌లోనే పాక్, ఆసీస్ జట్లు.. టీమిండియా స్థానం ఎక్కడంటే?

ఈ డ్రా తర్వాత కూడా ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టిక(WTC Points Table)లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌లు టాప్-2లో ఉన్నాయి.

WTC Points Table: డ్రాగా ముగిసిన రెండో టెస్ట్.. అయినా టాప్ ప్లేస్‌లోనే పాక్, ఆసీస్ జట్లు.. టీమిండియా స్థానం ఎక్కడంటే?
Pak Vs Aus Test
Venkata Chari
|

Updated on: Mar 16, 2022 | 7:08 PM

Share

కరాచీలోని నేషనల్ స్టేడియంలో పాకిస్థాన్, ఆస్ట్రేలియా(PAK vs AUS) మధ్య జరిగిన రెండో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. 425 బంతుల్లో 196 పరుగులతో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడి 607 నిమిషాల పాటు క్రీజులో నిలిచిన కెప్టెన్ బాబర్ అజామ్(Babar Azam) ఈ డ్రాలో హీరోగా నిలిచాడు. ఈ డ్రా తర్వాత కూడా ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టిక(WTC Points Table)లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌లు టాప్-2లో ఉన్నాయి. ఈ మ్యాచ్ తరువాత WTC పాయింట్ల పట్టికలో వచ్చిన మార్పలను ఓసారి పరిశీలీస్తే విషయం అర్థమవుతుంది. ఆస్ట్రేలియా 71.42 పాయింట్ల శాతాన్ని కలిగి ఉండడంతో మొదటి స్థానంలో నిలిచింది.

మార్చి 16, 2022 నాటికి WTC పాయింట్ల పట్టిక..

2021–2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో భాగంగా కంగారూలు నాలుగు మ్యాచ్‌లు గెలిచారు. అలాగే మరో మూడు టెస్టులను డ్రా చేసుకున్నారు. ప్రస్తుతం ఆ జట్టుకు 60 పాయింట్లు ఉన్నాయి. అదే సమయంలో, పాకిస్తాన్ 61.11 పాయింట్ల శాతాన్ని కలిగి ఉండడంతో రెండవ స్థానంలో ఉంది. పాకిస్థాన్‌కు ప్రస్తుతం 44 పాయింట్లు ఉన్నాయి. ఈ వ్యవధిలో ఇప్పటి వరకు ఆ జట్టు మూడు టెస్టులు గెలిచి, రెండు డ్రా చేసుకుంది. అలాగే ఓ మ్యాచులో ఓడింది.

దక్షిణాఫ్రికా 60 పాయింట్ల శాతం, 36 పాయింట్లతో మూడవ స్థానంలో ఉంది. రెండో టెస్టులో శ్రీలంకను ఓడించిన టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. అంతకు ముందు భారత్ ఐదో స్థానంలో నిలిచింది. అదే సమయంలో శ్రీలంక జట్టు విజయ శాతం 50కి తగ్గింది.

Also Read: Watch Video: అబ్బా.. ఏం పట్టింది.. ఇది క్యాచ్ కాదు అంతకు మించి.. లేడీ రోడ్స్ అంటూ నెటిజన్ల కామెంట్స్..

IPL 2022: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా యుజ్వేంద్ర చాహల్.. షాకిస్తోన్న వరుస ట్వీట్స్.. అసలు విషయం ఏంటంటే?