Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా యుజ్వేంద్ర చాహల్.. షాకిస్తోన్న వరుస ట్వీట్స్.. అసలు విషయం ఏంటంటే?

రాజస్థాన్ రాయల్స్ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయినట్లు తెలుస్తోంది. వరుస ట్వీట్లలో యుజ్వేంద్ర చాహల్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడంటూ షేర్ అవుతున్నాయి.

IPL 2022: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా యుజ్వేంద్ర చాహల్.. షాకిస్తోన్న వరుస ట్వీట్స్.. అసలు విషయం ఏంటంటే?
Ipl 2022 Rajasthan Royals, Yuzvendra Chahal
Follow us
Venkata Chari

|

Updated on: Mar 16, 2022 | 6:10 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022) 15వ సీజన్ ప్రారంభానికి మరో 10 రోజులు మాత్రమే ఉంది. ఈమేరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను బీసీసీఐ సిద్ధం చేసింది. 10టీంలు కూడా ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యాయి. రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) టీం ఈ ఏడాది యుజ్వేంద్ర చాహల్‌(yuzvendra chahal)ను జట్టులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా రాజస్థాన్ రాయల్స్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఒక పోస్ట్ షేర్ అయింది. అందులో చాహల్ ఫోటోని షేర్ చేశారు. ఈమేరకు రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్‌ని కలవండి అంటూ వరుసగా ట్వీట్స్‌ వెలుగుచూశాయి. దీంతో ఫ్యాన్స్ అంతా చాహల్‌ను కొత్త కెప్టెన్‌గా చేశారా లేదా దీని వెనుక ఏదైనా స్కామ్ ఉందా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

వరుసగా వెలుగు చూసిన ఈ ట్వీట్స్‌తో రాజస్థాన్ ట్విట్టర్ ఖాతా హ్యకింగ్‌కు గురైనట్లు తెలుస్తోంది. అందుకే ఇలాంటి ట్వీట్స్‌ వెలుగుచూశాయని అంటున్నారు. ముఖ్యంగా యుజ్వేంద్ర చాహల్‌ను టార్గెట్ చేసుకుని ఈ ట్వీట్స్ రావడం గందరగోళానికి గురి చేసింది. చాహల్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ఛాటింగ్ చేసినట్లుగా ఈ ట్వీట్స్ కనిపించాయి. అది కూడా ఈ ట్వీట్స్ చాలా సరదాగా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.. రాజస్థాన్ రాయల్స్ ఖాతాను హ్యాక్ చేస్తానని చహల్ అధికారిక ఖాతా నుంచి సరదాగా రాసుకొచ్చాడు. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ దానిపై ఒక మీమ్‌ను కూడా పంచుకుంది. దీని తర్వాత రాజస్థాన్ రాయల్స్ తమ పాస్‌వర్డ్‌ను చాహల్‌తో పంచుకున్నట్లు ట్వీట్స్ చూడొచ్చు.

ఆ తర్వాత పాస్‌వర్డ్ అందించినందుకు రాజస్థాన్ రాయల్స్‌కు ధన్యవాదాలంటూ చాహల్ పేర్కొన్నట్లు ట్వీట్స్ వచ్చాయి. అయితే ఇదంతా చూస్తే రాజస్థాన్ రాయల్స్ ట్విట్టర్ అకౌంట్ హ్యకింగ్‌కు గురైనట్లు తెలుస్తోంది. సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఐసీఎల్ 2022 సీజన్‌లో మొదటి మ్యాచ్ మార్చి 26న జరగనుంది. తొలి మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి.

Also Read: IPL 2022, Suresh Raina: సురేశ్ రైనా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ 2022లో రీఎంట్రీ..

Womens World Cup 2022: చ‌రిత్ర సృష్టించిన భారత ఫాస్ట్ బౌలర్.. ఆ లిస్టులో ఏకైక మహిళా ప్లేయర్‌గా రికార్డు..