Watch Video: అబ్బా.. ఏం పట్టింది.. ఇది క్యాచ్ కాదు అంతకు మించి.. లేడీ రోడ్స్ అంటూ నెటిజన్ల కామెంట్స్..
ICC Women's World Cup 2022: ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అయితే భారత జట్టు ఫీల్డింగ్‌లో ముఖ్యంగా హర్మన్‌ప్రీత్ కౌర్ క్యాచ్‌తో అభిమానుల హృదయాలను గెలుచుకుంది.
ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2022(ICC Women’s World Cup 2022)లో భారత జట్టు ఫీల్డింగ్ ఇప్పటివరకు చాలా ఆకట్టుకుంది. కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా జట్టు ఫీల్డింగ్ పట్ల చాలా సంతోషంగా ఉంది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అయితే భారత జట్టు ఫీల్డింగ్‌లో ముఖ్యంగా హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) క్యాచ్‌తో అభిమానుల హృదయాలను గెలుచుకుంది. రాజేశ్వరి గైక్వాడ్ బంతికి అమీ జోన్స్ భారీ షాట్ ఆడింది. అయితే హర్మన్ అద్భుతంగా క్యాచ్ అందుకుని ఆశ్చర్యపరిచింది. ఈ క్యాచ్‌ను చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.
క్యాచ్ పట్టే క్రమంలో హర్మన్ తలకిందులుగా పడిపోయింది. అయినా బాల్‌ను మాత్రం వదలలేదు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు బ్యాటింగ్ చాలా పేలవంగా ఉండడంతో ఓటమి పాలవ్వాల్సి వచ్చింది.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 36.2 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటైంది. స్మృతి మంధాన 35, రిచా ఘోష్ 33 పరుగులు చేశారు. వీరిద్దరూ కాకుండా ఝులన్ గోస్వామి 20 పరుగులు చేసింది. మిగిలిన వారు మాత్రం ఇంగ్లండ్ బౌలర్ల ముందు నిలవలేకపోయారు. అనంతరం ఇంగ్లండ్ 31.2 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసి విజయం సాధించింది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయిన భారత్.. రెండోసారి ఓటమి పాలైంది. సెమీఫైనల్‌కు చేరుకోవాలంటే భారత్ తదుపరి 3 మ్యాచ్‌లలో 2 గెలవాల్సి ఉంటుంది. ఈ ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు విజయం సాధించింది. అంతకుముందు, ఇంగ్లండ్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూడాల్సి ఉండగా, నాలుగో మ్యాచ్‌లో గెలవడం ద్వారా ఇంగ్లండ్ సెమీ ఫైనల్‌కు చేరుకోవాలనే ఆశలను సజీవంగా ఉంచుకుంది.
View this post on Instagram
IPL 2022, Suresh Raina: సురేశ్ రైనా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ 2022లో రీఎంట్రీ..