Viral Video: ఒయ్యారాలు పోతూ.. మనిషిలా రెండు కాళ్లతో నడుస్తున్న కుక్క.. నెట్టింట్లో వైరల్

Viral Video: జంతువులకు సంబంధించిన అనేక ఫన్నీ వీడియోలు(Funny Video) ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.  వీక్షకులు కూడా జంవుతులకు సంబంధించిన వీడియోలను చూడటానికి ఇష్టపడుతున్నారు. తాజాగా ఓ కుక్క వీడియో..

Viral Video: ఒయ్యారాలు పోతూ.. మనిషిలా రెండు కాళ్లతో నడుస్తున్న కుక్క.. నెట్టింట్లో వైరల్
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Mar 16, 2022 | 9:29 PM

Viral Video: జంతువులకు సంబంధించిన అనేక ఫన్నీ వీడియోలు(Funny Video) ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.  వీక్షకులు కూడా జంవుతులకు సంబంధించిన వీడియోలను చూడటానికి ఇష్టపడుతున్నారు. తాజాగా ఓ కుక్క వీడియో ఒకటి  నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఖచ్చితంగా మిమ్మల్ని కూడా ఆశ్చర్యపరుస్తుంది. నవ్వుల్లో ముంచెత్తెక కుండా ఉండదు. ఈ వైరల్ వీడియోలో, ఒక కుక్క తన యజమానితో సమానంగా మనిషిలా రెండు కాళ్లతో నడుస్తూ కనిపించింది. జంవుతుల ప్రేమికులు.. ముఖ్యంగా కుక్కలను అమితంగా ఇష్టపడేవారు ఈ వీడియోను ఇష్టపడతారు. ఈ వీడియోను చూసిన తర్వాత ఖచ్చితంగా షేర్ చేస్తారు.

పట్టుదల, దృఢ సంకల్పం ఉంటే ఎటువంటి వ్యక్తి అయినా విజయాన్ని సొంతం చేసుకుంటారు. వాస్తవానికి, ఇది మానవులకు మాత్రమే కాదు జంతువులకు కూడా వర్తిస్తుంది. ఇందుకు నిదర్శనంగా ఓ వీడియో బయటకు వచ్చింది. కుక్కలకు సంబంధించిన అనేక వీడియోలను మీరు ఇంతకు ముందు చాలాసార్లు చూసి ఉండవచ్చు, కానీ కుక్క మనిషిలా రెండు కాళ్లపై నడవడం చాలా అరుదుగా చూసే దృశ్యం.

వైరలైన ఈ వీడియోలో ఒక వ్యక్తి తన కుక్కతో వీధిలో నడుస్తున్నాడు. అయితే అందరి దృష్టి అతనితో ఉన్న కుక్కపైనే ఉంది. ఎందుకంటే ఈ కుక్క.. గేమ్స్ ఆడుతూనో .. లేక తన యజమానిని అనుసరిస్తూనో లేదు.. తన  యజమాని వలె, కుక్క రెండు కాళ్ళపై దర్జాగా నడుస్తుంది. ఇలా కుక్క యజమానితో సమానంగా రెండు కాళ్లతో నడుస్తున్న సమయంలో ఓ   కారులో కూర్చున్న ఓ వ్యక్తి తన కెమెరాలో బంధించాడు. ఈ వీడియో ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంది.  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్ యానిమల్‌వీడియోస్కో పేజీలో ఈ వీడియో షేర్ చేయబడింది. ఇప్పటివరకు 81,000 మందికి పైగా వీక్షించారు. వేలాది మంది ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేస్తున్నారు.

వీక్షకులు కూడా ఈ వీడియోపై స్పాంటేనియస్‌గా స్పందిస్తున్నారు.  కుక్క లోపల అద్భుతమైన కళ ఉందని ఒక యూజర్ కామెంట్ చేశాడు. కుక్క నడక ఠీవి చూస్తుంటే తాను ఫిదా అని మరొకరు వ్యాఖ్యానించారు.

Also Read: Eiffel Tower: మరింత ఎత్తు పెరిగిన ఈఫిల్ టవర్.. కారణమేంటంటే

Wines Shops: మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్.. రెండు రోజుల పాటు బార్లు, వైన్స్‌లు బంద్!

Holi 2022: రేపు హోలికా దహనం.. శుభ సమయం, పూజా విధానం.. కలిగే ఫలితాలు పూర్తి వివరాలు