Wines Shops: మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్.. రెండు రోజుల పాటు బార్లు, వైన్స్‌లు బంద్!
హోలీ పండుగ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు ఆంక్షలు విధించారు. హైదరాబాద్ మహా నగర పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. జంట నగరాల పరిధిలో 48 గంటల పాటు ఆ ఆంక్షలు అమలులొకి రానున్నాయి.
Wine Shops In Hyderabad: హోలీ పండుగ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు ఆంక్షలు విధించారు. హైదరాబాద్ మహా నగర పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. జంట నగరాల పరిధిలో 48 గంటల పాటు ఆ ఆంక్షలు అమలు ఉంటాయని పేర్కొన్నారు. అలాగే హోలీ సందర్భంగా రేపు సాయంత్రం నుంచి బార్లు, వైన్స్, కల్లు దుకాణాలను మూసివేయాలని ఆదేశించారు. హోలీ వేడుకల్లో పాల్గొనే వారు ఇతరులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని పోలీసు ఉన్నతాధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. సిటీలో తిరిగే వాహనదారులపై రంగులు చల్లరాదని పేర్కొన్నారు. వాహనాలపై పబ్లిక్ రోడ్స్ లో గుంపులుగా తిరుగుతూ న్యూసెన్స్ చేయొద్దని సూచించారు. ఈ ఆంక్షలు నగరంలోని మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో అమలులోకి రానున్నాయి.
గురువారం సాయంత్రం 6 నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు. ఈనెల 17వ తేదీ గురువారం సాయంత్రం 6 నుంచి 19వ తేదీ శనివారం ఉదయం 6 గంటల వరకు జంట నగరాల్లోని బార్లు, వైన్స్, కల్లు దుకాణాలను మూసి ఉంచాలని ఆదేశించారు. ఇదిలావుంటే, రెండు రోజుల పాటు మద్యం షాపులు మూతపడుతుండటంతో మద్యం ప్రియులు లిక్కర్ షాపుల వద్ధ పెద్ద సంఖ్యలో బారులు తీరారు. దీంతో హైదరాబాద్ మహానగర పరిధిలో అన్ని మద్యం దుకాణాలు కిటకిటలాడుతున్నాయి.
Read Also…. AP High Court: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు.. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేత!