Minister Harish rao: త్వరలోనే వైద్యారోగ్య శాఖలో ఖాళీలు భర్తీ చేస్తాం.. మంత్రి హరీశ్ రావు కీలక ప్రకటన
తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో (Health Department) ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని సంబంధిత శాఖ మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. ఖైరతాబాద్ వెల్ నెస్ కేంద్రంలో ఏర్పాటు చేసిన 50 పడకల ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని...
తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో (Health Department) ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని సంబంధిత శాఖ మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. ఖైరతాబాద్ వెల్ నెస్ కేంద్రంలో ఏర్పాటు చేసిన 50 పడకల ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమ్మద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. 12 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రులు ప్రారంభించారు. ఇవాళ నేషనల్ వాక్సినేషన్ డే (Vaccination Day) జరుపుకుంటున్నామని ఇందులో భాగంగా రాష్ట్రంలో 12నుంచి 14 ఏళ్ల వయస్సు వారికి వ్యాక్సిన్ వేస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు అన్నారు. కొవిడ్ ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గలేదని చైనా, అమెరికా, హాంగ్‌కాంగ్‌లో కొత్త కేసులు వస్తున్నాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ.. వాకిన్స్ వేయించుకోవాలని మంత్రి సూచించారు. ప్రపంచంలో తయారైన వ్యాక్సిన్లలో రెండు హైదరాబాద్ నుంచే తయారయ్యాయని తెలిపారు. ఇప్పుడు 12-14 ఏళ్ల పిల్లలకు వేస్తున్న కార్బోవాక్స్ కూడా ఇక్కడే తయారైందని వెల్లడించారు. 60 ఏళ్లు దాటిన వారు బూస్టర్ డోస్ వేయించుకోవాలని హరీష్ రావు కోరారు. రెండు డోసులు వ్యాక్సిన్ వేయించుకున్న వారు మాత్రమే థర్డ్ వేవ్ లో కరోనా బారిన పడలేదని అన్నారు.
“కరోనా ప్రభావం తగ్గినప్పటికీ వైరస్ ముప్పు పొంచి ఉంది. మూడోదశలో కరోనా ప్రభావం చూపలేదనే నిర్లక్ష్య ధోరణి వద్దు. ప్రతి ఒక్కరూ విధిగా కొవిడ్ వ్యాక్సినేషన్ తీసుకోవాలి. కరోనా కేసులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. చైనా, అమెరికా, హాంకాంగ్‌లో కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్త వ్యాక్సిన్ కోసం ప్రపంచం హైదరాబాద్ వైపు చూస్తోంది. దేశంలో వచ్చిన 3 వ్యాక్సిన్లలో 2 హైదరాబాద్ నుంచే వచ్చాయి.”
-హరీశ్‌రావు, తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి
కొవిడ్ ప్రభావం తగ్గిపోయిందనుకోవడం చాలా పొరపాటు అని మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. చైనా, హాంకాంగ్, అమెరికాలో మళ్లీ కేసులు వస్తున్నాయని తెలిపారు. అందరూ విధిగా కొవిడ్ టీకా తీసుకోవాలని కోరారు. అంతకుముందుగా ఖైరతాబాద్‌లో 50 పడకల CHCని మంత్రి హరీశ్ రావు ప్రారభించారు.
Also Read
Viral Video: లైవ్ జరుగుతుండగా నిరసన.. మహిళా జర్నలిస్ట్ కు 15 ఏళ్ల జైలుశిక్ష.. కారణమేంటంటే