AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: పాతికేళ్ల కుర్రాడిలా బైక్‌ స్టంట్‌ చేస్తోన్న ఈ స్టార్‌ ఎవరో గుర్తుపట్టారా.? ఈ హీరో వయసు 60 ఏళ్ల పైనే..

Viral Photo: బైక్‌ స్టంట్‌లు, యాక్షన్‌ సన్నివేశాలు ఇలాంటి సన్నివేశాల్లో నటించడం కుర్ర హీరోలకే సాహసంతో కూడుకున్న పని. అలాంటిది సీనియర్‌ హీరోలు యాక్షన్‌ సీన్స్‌ నటించడం అసాధ్యమని చెప్పాలి. మరీ కుదరదంటే డూప్‌తో సన్నివేశాలతో కానిచ్చేస్తుంటారు. కానీ ఓ టాలీవుడ్‌ సీనియర్‌ హీరో...

Viral Photo: పాతికేళ్ల కుర్రాడిలా బైక్‌ స్టంట్‌ చేస్తోన్న ఈ స్టార్‌ ఎవరో గుర్తుపట్టారా.? ఈ హీరో వయసు 60 ఏళ్ల పైనే..
Narender Vaitla
|

Updated on: Mar 16, 2022 | 2:34 PM

Share

Viral Photo: బైక్‌ స్టంట్‌లు, యాక్షన్‌ సన్నివేశాలు ఇలాంటి సన్నివేశాల్లో నటించడం కుర్ర హీరోలకే సాహసంతో కూడుకున్న పని. అలాంటిది సీనియర్‌ హీరోలు యాక్షన్‌ సీన్స్‌ నటించడం అసాధ్యమని చెప్పాలి. మరీ కుదరదంటే డూప్‌తో సన్నివేశాలతో కానిచ్చేస్తుంటారు. కానీ ఓ టాలీవుడ్‌ సీనియర్‌ హీరోకు మాత్రం ఇలాంటి యాక్షన్‌ సన్నివేశాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసేస్తారు. ఆ హీరో వయసు అక్షరాల 62 ఏళ్లు.. అయినా యంగ్‌ హీరోలకు పోటీనిస్తూ మరీ దూసుకుపోతున్నారు. వరుసగా సినిమాలు చేస్తూ ఏకంగా తన కొడుకలతోనే పోటీ పడుతున్నారు. ఇదంతా ఎడారిలో బైక్‌ స్టంట్‌ చేస్తున్న హీరో గురించే.

Viral Photo

ఇంతకీ పైన ఫోటోలో ఉన్న ఆ సీనియర్‌ హీరో ఎవరో గుర్తు పట్టారా.? తండ్రి నట వారసత్వంగా వెండి తెర ఎంట్రీ ఇచ్చిన తన ట్యాలెంట్‌తో అశేష అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఒక్క సినిమాతో టాలీవుడ్‌ గతిని మలుపు తిప్పారు. యాక్షన్‌ హీరోగా రాణిస్తున్న సమయంలోనే భక్తి సినిమాల్లో నటిస్తూ తనదైన ముద్ర వేశారు. ఈ సీనియర్‌ హీరో మరెవరో కాదు. అప్పట్లో యువ సామ్రాట్‌, ఇప్పుడు కింగ్ నాగార్జునే. బంగార్రాజు సినిమాతో ఈ ఏడాది సూపర్ హిట్‌ను అందుకున్న నాగ్.. తాజాగా ‘ఘోస్ట్‌’ సినిమాలో నటిస్తున్నారు.

‘గరుడవేగ’ ఫేమ్‌ ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగానే దుబాయ్‌లోని ఎడారిలో ప్రాంతాల్లో యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో భాగంగా నాగ్ అడ్వెంచర్‌ బైక్‌ స్టంట్స్‌ చేసిన ఫోటోలు ప్రస్తుతం నెటింట్లో చక్కర్లు కొడుతున్నాయి. నాగ్ డెడికేషన్‌ను చూసిన ఆయన ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. ఏది ఏమైనా 62 ఏళ్ల వయసులోనూ నో కాంప్రమైజ్‌ అంటూ దూసుకుపోతున్న నాగ్‌ నిజంగానే గ్రేట్‌ కదూ.!

Also Read: Anchor Suma Kanakala: యాంకర్ సుమ కొడుకును చూశారా ?.. హీరోకు ఏమాత్రం తీసిపోడు..

Joint Pain: కీళ్ల నొప్పుల సమస్యకు ఆయుర్వేద పరిష్కారం

TS AIDS Control Society Jobs 2022: డిగ్రీ/డిప్లొమా అర్హతతో.. తెలంగాణ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీలో ఉద్యోగాలు..పూర్తివివరాలివే!