Anchor Suma Kanakala: యాంకర్ సుమ కొడుకును చూశారా ?.. హీరోకు ఏమాత్రం తీసిపోడు..

యాంకర్ సుమ కనకాల (Anchor Suma).. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేనిపేరు.. అటు బుల్లితెర.. ఇటు వెండితెర ప్రేక్షకులకు

Anchor Suma Kanakala: యాంకర్ సుమ కొడుకును చూశారా ?.. హీరోకు ఏమాత్రం తీసిపోడు..
Suma
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 16, 2022 | 1:04 PM

యాంకర్ సుమ కనకాల (Anchor Suma).. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేనిపేరు.. అటు బుల్లితెర.. ఇటు వెండితెర ప్రేక్షకులకు యాంకర్ సుమ సుపరిచితురాలు.. చలాకీతనం.. వాక్చాతుర్యంతో టాప్ యాంకర్‏గా దూసుకుపోతుంది. అంతేకాకుండా.. తాను హోస్ట్‏గా చేస్తోన్న షోలలో తనదైన పంచులతో కామెడీని పండిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. పలు టీవీ షోస్.. ఇటు ప్రీరిలీజ్ ఈవెంట్స్.. సక్సెస్ మీట్స్ అంటూ తెగ బిజీగా గడిపేస్తుంది. ఇక ఇటీవల సోషల్ మీడియా సుమ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి తన మాటల గారడితో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. మలయాళి అమ్మాయి అయిన.. తెలుగులో అనర్గళంగా మాట్లాడుతూ. తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యింది. నటుడు రాజీవ్ కనకాలను ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత పూర్తిగా బుల్లితెరకు అంకితమైంది సుమ.

తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో తన కొడుకుతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసింది. అందులో సుమ కొడుకు రోషన్ పూర్తిగా మారిపోయి సరికొత్త లుక్‏లో హీరోలకు ఏమాత్రం తీసిపోడు అనే విధంగా ఉన్నాడు. మార్చి 15న రోషన్ పుట్టినరోజు కావడంతో తన కొడుకుతో కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తోన్న ఫోటోలను సుమ షేర్ చేసింది. అయితే రోషన్‏కు బర్త్ డే విషెష్ చెబుతూ.. నెటిజన్స్ ఆ ఫోటోలను చూసి షాకవుతున్నారు.. రోషన్ ఇంతలా మారిపోయాడేంటీ.. అప్పుడే హీరోలా అయ్యడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సుమ, రోషన్ తల్లికొడుకుల్లా లేరని.. అక్క తమ్ముడిలా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్‏తో కలిసి నిర్మల కాన్వెంట్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన రోషన్.. ఆ తర్వాత పై చదువుల కోసం యూఎస్ వెళ్లాడు.. ఇటీవల ఇండియాకు వచ్చి.. తిరిగి సినిమాలపై ఫోకస్ పెట్టాడు..

View this post on Instagram

A post shared by Suma K (@kanakalasuma)

Also Read: Megastar Chiranjeevi: ఆనంద విషాదాల కలయికే జీవితం.. పునీత్ సినిమాపై మెగాస్టార్ ఎమోషనల్ కామెంట్స్..

Mission Imposible Trailer: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కోసం జర్నలిస్ట్ అన్వేషణ.. ఆకట్టుకుంటున్న మిషన్ ఇంపాజిబుల్ ట్రైలర్..

RRR Movie: జక్కన్న సినిమాకు ఊరట.. ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రదర్శనను నిలిపేయాలన్న పిల్‌ కొట్టేసిన హైకోర్టు..

Major: మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‏కు నివాళిగా స్పెషల్ వీడియో రిలీజ్.. మరపురాని సంఘటనలను గుర్తుగా..