Mishan Impossible Trailer: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కోసం జర్నలిస్ట్ అన్వేషణ.. ఆకట్టుకుంటున్న మిషన్ ఇంపాజిబుల్ ట్రైలర్..

చాలా కాలం తర్వాత క్రేజీ హీరోయిన్ తాప్సీ పన్ను (Tapsee Pannu) తెలుగులో నటిస్తోన్న చిత్రం మిషన్ ఇంపాజిబుల్ (Mishan Impossible).

Mishan Impossible Trailer: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కోసం జర్నలిస్ట్ అన్వేషణ.. ఆకట్టుకుంటున్న మిషన్ ఇంపాజిబుల్ ట్రైలర్..
Thapsee
Follow us
Rajitha Chanti

| Edited By: Anil kumar poka

Updated on: Mar 16, 2022 | 11:59 AM

చాలా కాలం తర్వాత క్రేజీ హీరోయిన్ తాప్సీ పన్ను (Tapsee Pannu) తెలుగులో నటిస్తోన్న చిత్రం మిషన్ ఇంపాజిబుల్ (Mishan Impossible). ఈ సినిమాను.. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ మరో కంటెంట్-రిచ్ ఫిల్మ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ దర్శకుడు స్వరూప్ RSJ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్.. వీడియోస్.. సాంగ్స్ మూవీపై ఆసక్తిని క్రియేట్ చేశాయి. ప్రస్తుతం శరవేగంగ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేసి టీమ్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ట్రైలర్ నిజానికి సినిమా ప్లాట్‌ లైన్‌ లోని విష‌యాన్ని తెలియ‌జేస్తుంది.

అవినీతిపరుడైన రాజకీయ నాయకుడు అరెస్టు, ఆ త‌ర్వాత‌ బెయిల్ అనే అంశాన్ని చెబుతూ ఇన్వెస్టిగేటివ్ పాత్రికేయురాలుగా తాప్సీ డైలాగ్‌తో ప్రారంభమవుతుంది. ఆమె, తన టీం ఈ మిషన్‌ను నిర్వహించడం దాదాపు అసాధ్యమని భావించినప్పుడు, వారు తక్కువ సమయంలో ధనవంతుడిగా మారిన భార‌త‌దేశపు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీంను పట్టుకోవడానికి ముగ్గురు పిల్లల సహాయం తీసుకుంటారు. అసాధ్యమైనది ఏమీ లేదని భావించే తాప్సీ పిల్ల‌ల ధైర్యాన్ని చూసి ఆశ్చ‌ర్య‌పోతుంది. వారు ఈ మిషన్‌ను ఎలా పూర్తి చేస్తారు అనేది కథలో కీలకాంశంగా మారుతుంది. నిజమైన సంఘటన ఆధారంగా స్వరూప్ RSJ తన అద్భుతమైన రచన, టేకింగ్‌తో క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో రూపొందించారు. ట్రైలర్‌లో చూపించినట్లుగా ఈ సినిమా అన్ని కమర్షియల్ హంగులను కలిగి ఉండ‌డ‌మే కాకుండా ఇది యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కూడిన పూర్తి ఎంటర్‌టైనర్. తాప్సీ ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం ఒక పెద్ద ఎసెట్‌. ఆమె తన నటనతో మ‌రో స్థాయిని గెలుచుకుంది. కానీ పిల్లలు తమ చ‌లాకీత‌నంతో సినిమాను మ‌రింత‌ ఎత్తుకు తీసుకెళ్ళారు. వారు వారి వారి పాత్రలలో కథనానికి తాజాదనాన్ని తీసుకువ‌చ్చారు.

దీపక్ యెరగరా సినిమాటోగ్రఫీ ఆకట్టుకోగా, మార్క్ కె రాబిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో పెద్ద అసెట్. సహజంగానే, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ విలువలు సినిమా యొక్క జానర్‌ ఉన్నత స్థాయిలో ఉన్నాయి. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఎన్ ఎం పాషా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వేసవిలో అపరిమిత వినోదాన్ని అందించడానికి మిష‌న్ ఇంపాజిబుల్ ఏప్రిల్ 1న థియేటర్లలో విడుదల అవుతుంది.

Also Read: RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. మరో ట్రైలర్ ను రిలీజ్ చేసే ప్లాన్ లో జక్కన్న..

Boyapati Srinu: తన మార్క్ ఆఫ్ యాక్షన్‌ జానర్‌ పాన్ ఇండియా మూవీ వైపు అడుగులేస్తున్న బోయపాటి

Alia Bhatt : బాలీవుడ్ టు హాలీవుడ్ వయా టాలీవుడ్.. బీటౌన్ బ్యూటీ జోరు మాములుగా లేదుగా.

Pushpa The Rise: ఇంకా తగ్గని పుష్ప మేనియా.. ఈసారి పోలీసుల వంతు.. వైరల్ అవుతున్న వీడియో..