Prabhas: డార్లింగ్ మనసు బంగారం.. మరోసారి మంచి మనసు చాటుకున్న ప్రభాస్
సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ గురించి ఎవరిని అడిగినా చాలా మంచి వాడు, గ్రౌండ్ టు ఎర్త్ అని చెబుతుంటారు. ఎందుకంటే ఎప్పుడూ ఏదో ఒక సందర్భంలో తన మంచి మనసును చాటుకుంటూనే ఉంటారు ప్రభాస్.
సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ గురించి ఎవరిని అడిగినా చాలా మంచి వాడు, గ్రౌండ్ టు ఎర్త్ అని చెబుతుంటారు. ఎందుకంటే ఎప్పుడూ ఏదో ఒక సందర్భంలో తన మంచి మనసును చాటుకుంటూనే ఉంటారు ప్రభాస్. వరదలతో సర్వం కోల్పోయిన వారికి భారీ ఆర్థిక సాయం అందిస్తూ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. అందుకే ప్రభాస్‌ను ఆయన సన్నిహితులు డార్లింగ్ అని ముద్దుగా పిలుచుకుంటారు. తాజాగా డార్లింగ్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన విషయం తెలిసిందే. అంగరంగ వైభవంగా సాగిన ఈ ఈవెంట్‌లో 30 వేల మందికి పైగా పాల్గొన్నారని సమాచారం. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొందరు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఈవెంట్‌లో ఏర్పాటు చేసిన ప్రభాస్ భారీ కటౌట్‌లపైకి ఎక్కారు. ఈ క్రమంలోనే కొంత మంది అభిమానులు కటౌట్స్ పై నుంచి జారి పడి గాయాలపాలయ్యారు.
Viral Video: చనిపోయిన తమ్ముడిని మళ్లీ బతికించిన అక్క.. గుండెలు పిండేస్తున్న వీడియో..!