AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: చనిపోయిన తమ్ముడిని మళ్లీ బతికించిన అక్క.. గుండెలు పిండేస్తున్న వీడియో..!

Viral Video: అన్నాచెల్లెలు.. అక్కా తమ్ముడు. ఈ బంధాలపై ఎంత మాట్లాడుతున్న తక్కువే. ఒకరిపై ఒకరికి ఉండే ప్రేమానురాగాలు వెలకట్టలేనివి.

Viral Video: చనిపోయిన తమ్ముడిని మళ్లీ బతికించిన అక్క.. గుండెలు పిండేస్తున్న వీడియో..!
Brother Nd Sister
Shiva Prajapati
|

Updated on: Mar 16, 2022 | 6:31 AM

Share

Viral Video: అన్నాచెల్లెలు.. అక్కా తమ్ముడు. ఈ బంధాలపై ఎంత మాట్లాడుతున్న తక్కువే. ఒకరిపై ఒకరికి ఉండే ప్రేమానురాగాలు వెలకట్టలేనివి. తాజాగా తమ్ముడిపై ఓ అక్క చూపిన వినూత్న అభిమానం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఆ వీడియో చూసి నెటిజన్స్ అబ్బురపడిపోతున్నారు.

వివరాల్లోకెళితే.. తమిళనాడులో దిండిగల్ జిల్లాలోని ఒట్టన్‌ఛత్రంలో తన తమ్ముడి చేత కూతురి చెవులు కుట్టించే వేడుకను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది అక్క ప్రియదర్శిని. గుర్రపు జట్కా బండిపై తమ్ముడిని కూర్చొబెట్టి ఆట, పాటలు, కోలాటాల మధ్య ఊరేగించింది. తమ్ముడు పాండీదురై పై ప్రేమను చాటుకుంది. తన తమ్ముడే తన హీరో అని చాటిచెప్పింది అక్క ప్రియదర్శిని. అయితే, ఇక్కడే అద్భుతమైన ట్విస్ట్ ఉంది.

దిండిగల్ జిల్లాలోని ఒట్టన్‌ఛత్రంకు చెందిన పాండీదురై రెండేళ్ల క్రితం యాక్సిడెంట్ మరణించాడు. అయితే తనకూతురి చెవులు కుట్టించే వేడుకను మేనమామ హోదాలో తమ్ముడు పాండీదురై ఒళ్ళో కూర్చోపెట్టి వేడుక గ్రాండ్ చేయాలని ప్లాన్ చేసింది అక్క ప్రియదర్శిని. పాండిదురై లేనిలోటు తెలియకుండా ఉండేందుకు సిలికాన్ విగ్రహం ఏర్పాటు చేసింది. ఊరంతా సంబరాలతో అంగరంగ వైభవంగా చెవులు కుట్టించే వేడుకలు నిర్వహించింది. ఈ వేడుకలో తమ్ముడు లేని లోటే లేకుండా చేసింది అక్క ప్రియదర్శిని.

‘‘మేనమామ హోదాలో నా తమ్ముడు ఒళ్ళో కూర్చోపెట్టి నా కూతురికి సంబంధించిన అన్ని వేడుకలు జరిపించాలని అనుకున్నాను. కానీ నా తమ్ముడు చనిపోవడంతో మేము పూర్తిగా విషాదంలోకి వెళ్ళిపోయాము. ఈ విధంగా మా తమ్ముడిని మళ్ళీ మేము గుర్తు చేసుకుంటూ మా సంతోషాన్ని మా తమ్ముడుతో పంచుకుంటున్నట్టే ఉంది.’’ అని ప్రియదర్శిని, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

ఇక ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చనిపోయిన తన తమ్ముడు కోసం అక్క చేసిన ప్రయత్నం భళా అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.

Also read:

Viral Video: పిల్లికి ప్రష్టేషన్.. బాతుకు సెలబ్రేషన్.. ఈ సీను చూశారంటే పొట్టచెక్కలవడం ఖాయం..!

SBI Customers alert: మార్చి 31 లాస్ట్ డేట్.. లేదంటే ఇబ్బందులు తప్పవు.. ఖాతాదారులను అలర్ట్ చేసిన ఎస్‌బిఐ..

Viral Video: మామిడికాయ కాదు కోడిగుడ్డే.. కాలజ్ఞానంలో బ్రహ్మంగారూ చెప్పని వింత ఇది..!