SBI Customers alert: మార్చి 31 లాస్ట్ డేట్.. లేదంటే ఇబ్బందులు తప్పవు.. ఖాతాదారులను అలర్ట్ చేసిన ఎస్‌బిఐ..

SBI Customers alert: భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులను అలర్ట్ చేసింది.

SBI Customers alert: మార్చి 31 లాస్ట్ డేట్.. లేదంటే ఇబ్బందులు తప్పవు.. ఖాతాదారులను అలర్ట్ చేసిన ఎస్‌బిఐ..
Sbi
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 15, 2022 | 8:30 PM

SBI Customers alert: భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులను అలర్ట్ చేసింది. ఖాతాదారులకు ఎలాంటి అవాంతరాలు లేని బ్యాంకింగ్ సేవలను పొందేందుకు తమ శాశ్వత ఖాతా నంబర్ (పాన్)ని ఆధార్ కార్డ్‌తో మార్చి 31 గడువులోగా లింక్ చేయాలని సూచించింది. ఈ మేరకు ఎస్‌బిఐ అధికారిక ప్రకటన విడుదల చేసింది. సోషల్ మీడియా వేదికగా కూడా కస్టమర్లను అలర్ట్ చేసింది. ‘‘ఏ విధమైన అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకు. అవాంతరాలు లేని బ్యాంకింగ్ సేవలను ఆస్వాదించడానికి కస్టమర్లు వారి పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోవాలి.’’ అని సూచించింది.

పర్మనెంట్ అకౌంట్ నెంబర్(PAN) ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన పది అంకెల విశిష్ట ఆల్ఫాన్యూమరిక్ నంబర్. ఆర్థికపరమైన లావాదేవీలకు ఈ పాన్ నెంబర్ కీలకం. అన్ని లావాదేవీలు దీని ఆధారంగానే జరుగుతాయి. అయితే, ప్రతీ లావాదేవీలకు సంబంధించి వివరాలు పక్కాగా ఉండాలని, ప్రభుత్వ పథకాలు అసలైన లబ్ధిదారులకు అందించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం.. పాన్, ఆధార్ కార్డుల అనుసంధానం చేయాలని ప్రజలకు సూచించింది. ఇందుకోసం గడువు కూడా విధించింది. గతంలోనే అనేక పర్యాయాలు పాన్-ఆధార్ లింకింగ్‌ డేట్‌ను పొడగిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే మార్చి 31, 2022 చివరి తేదీగా కేంద్రం ప్రకటించింది.

ఈ నేపథ్యంలో తాజాగా ఎస్‌బిఐ తన కస్టమర్లను అలర్ట్ చేసింది. ఒకవేళ గడువు తేదీలోపు పాన్-ఆధార్ లింక్ చేయకపోతే ట్రాన్సాక్షన్స్ చేయడంలో అవాంతరాలు ఏర్పడుతాయి. ఇదే విషయాన్ని వివరిస్తూ ఎస్‌బిఐ ట్వీట్ చేసింది.

మీ పాన్ కార్డ్‌ని – ఆధార్ కార్డ్‌తో ఆన్‌లైన్‌లో ఎలా లింక్ చేయాలో ఇక్కడ తెలుసుకోండి.. 1. కొత్త ఇ-ఫైలింగ్ పోర్టల్ 2.0(https://www.incometax.gov.in/iec/foportal) కి వెళ్లండి. 2. ‘లింక్ ఆధార్’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. 3. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. 4. అక్కడ అడిగిన వివరాలను నమోదు చేయండి. పాన్ నెంబర్, ఆధార్ నంబర్, ఆధార్ ప్రకారం పేరు, మొబైల్ నెంబర్ నమోదు చేయాలి. 5. ఇప్పుడు (I have only year of birth in Aadhaar card, I agree to validate my Aadhaar details) బాక్స్‌లను టిక్ చేయాలి. 6. ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు 6 అంకెల ఓటీపీ వస్తుంది. 7. ధృవీకరణ పేజీలో ఈ ఓటీపీని నమోదు చేసి ‘కన్‌ఫామ్’ చేయాలి. 8. ఆ తరువాత పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయాలనే మీ అభ్యర్థన సమర్పించబడిందని పేర్కొంటూ మీకు పాప్-అప్ సందేశం వస్తుంది.

Also read:

Viral Video: మామిడికాయ కాదు కోడిగుడ్డే.. కాలజ్ఞానంలో బ్రహ్మంగారూ చెప్పని వింత ఇది..!

Holi 2022 bank holiday: కస్టమర్లకు అలెర్ట్.. వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు బంద్.. ఎందుకంటే!

Telangana Police Jobs: పోలీస్ శిక్షణా కేంద్రాల్లో ట్రైనింగ్ తీసుకోవాలని భావిస్తున్నారా? ఇలా అప్లై చేసుకోండి..!

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే