Telangana Police Jobs: పోలీస్ శిక్షణా కేంద్రాల్లో ట్రైనింగ్ తీసుకోవాలని భావిస్తున్నారా? ఇలా అప్లై చేసుకోండి..!

Telangana Police Jobs: తెలంగాణ పోలీస్ శాఖలో ఉద్యోగం కోసం ట్రై చేస్తున్న ఉద్యోగార్థులకు రాష్ట్ర పోలీస్ శాఖ బంపర్ ఆఫర్ ప్రకటించింది.

Telangana Police Jobs: పోలీస్ శిక్షణా కేంద్రాల్లో ట్రైనింగ్ తీసుకోవాలని భావిస్తున్నారా? ఇలా అప్లై చేసుకోండి..!
Ts Police Jobs
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 15, 2022 | 5:18 PM

Telangana Police Jobs: తెలంగాణ పోలీస్ శాఖలో ఉద్యోగం కోసం ట్రై చేస్తున్న ఉద్యోగార్థులకు రాష్ట్ర పోలీస్ శాఖ బంపర్ ఆఫర్ ప్రకటించింది. పోలీస్ కొలువు కోసం శిక్షణ పొందాలనుకునే వారికి స్వయంగా డిపార్ట్‌మెంట్ శిక్షణ అందిస్తుందని ఇప్పటికే ప్రకటించిన అధికారులు.. తాజా మరో కీలక అప్‌డేట్ ప్రకటించారు. పోలీస్ ఉద్యోగం కోసం శిక్షణ పొందాలనుకున్న ఉద్యోగార్థులు.. ఆయా జోన్‌ల పరిధిలోని పోలీసు శిక్షణా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ప్రకటించారు. ఆసక్తి గల వారు మార్చి 14వ తేదీ నుంచి 18వ తేదీ మధ్య దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లాలు, కమిషనరేట్ల పరిధిలోని పోలీస్ శిక్షణా కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అభ్యర్థులు నేరుగా ఆయా కేంద్రాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

అభ్యర్థుల అర్హతలు: 1. ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. 2. 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు. 3. ధరఖాస్తు కోసం ఆధార్ కార్డు తప్పనిసరి. 4. 2 పాస్‌ పోటోలు తీసుకురావాలి.

ఉద్యోగ ఖాళీలు..

ఇదిలాఉంటే ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసింది. అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. 80 వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. వీటిలో 18,334 ఉద్యోగాలు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోనే ఉన్నాయి. అయితే, ఈ పోలీస్ ఉద్యోగాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల నుంచి, పట్టణ ప్రాంతాల నుంచి కూడా అభ్యర్థులు పోటీ పడుతుంటారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కమిషనరేట్లు, జిల్లాల పరిధిలో పోలీస్ శాఖలో ఉద్యోగాల కోసం ప్రయత్నించే యువత కోసం ప్రత్యేక శిక్షణా శిభిరాలు ఏర్పాటు చేయనున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి ప్రకటించారు.

Also read:

Income Tax Returns: పన్ను ఎగవేతదారులకు షాకింగ్ న్యూస్.. 15 ఏళ్ల ఐటీ రిటర్న్స్‌ను పరిశీలించబోతున్న ఆదాయపన్ను శాఖ!

RRR Movie: మరో వివాదంలో చిక్కుకున్న జక్కన్న చెక్కిన ‘ఆర్ఆర్ఆర్’.. ఈ సారి ఇలా

Mirchi Rasgulla: ఘాటెక్కించే మిర్చి రసగుల్లా.. ఇది చాలా హాట్ గురూ.. టేస్ట్ చూస్తే వావ్ అనాల్సిందే