AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR Movie: మరో వివాదంలో చిక్కుకున్న జక్కన్న చెక్కిన ‘ఆర్ఆర్ఆర్’.. ఈ సారి ఇలా

ఆర్ఆర్ఆర్(RRR) చుట్టూ రగడ అలుముకుంటోంది. అల్లూరి హిస్టరీపై కాంట్రవర్సీ క్రియేటవుతోంది. సినిమా నేమ్‌పై కొత్త వివాదం చెలరేగుతోంది.

RRR Movie: మరో వివాదంలో చిక్కుకున్న జక్కన్న చెక్కిన 'ఆర్ఆర్ఆర్'.. ఈ సారి ఇలా
Rrr
Rajeev Rayala
|

Updated on: Mar 15, 2022 | 5:06 PM

Share

RRR Movie: ఆర్ఆర్ఆర్(RRR) చుట్టూ రగడ అలుముకుంటోంది. అల్లూరి హిస్టరీపై కాంట్రవర్సీ క్రియేటవుతోంది. సినిమా నేమ్‌పై కొత్త వివాదం చెలరేగుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి, కొమరం భీమ్ చరిత్రను వక్రీకరించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అల్లూరి, కొమురం భీమ్‌ల పేర్లను తొలగించి సినిమాను రిలీజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అల్లూరి సీతారామరాజు మేనల్లుడు గొట్టిముక్కల వెంకట సత్యనారాయణ. గాంధీ ఆయుధాలు పట్టి బ్రిటీష్‌ వాళ్లపై పోరాటం చేశారని.. నేతాజీతో కలిసి ఉద్యమాలు చేశారా అని సినిమా తీయగలరా అని ప్రశ్నించారాయన. డబ్బు కోసం చరిత్రను వక్రీకరిస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో చరిత్ర వక్రీకరణపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు గొట్టిముక్కల. విడుదలకు సిద్ధమవుతున్న ఆర్ఆర్ఆర్ కు వివాదాలు కొత్తేం కాదు.

గతంలోనూ సినిమా చిత్రీకరణ సమయంలోనే స్క్రిప్ట్‌పై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అల్లూరి సంఘం ఈ సినిమా చిత్రీకరణపై విమర్శలు గుప్పించింది. డబ్బులు.. కమర్షియల్ అంశాల కోసం ఓ సినిమా పేరుతో తమ చరిత్రను పూర్తిగా వక్రీకరిస్తున్నారని.. అది రాజమౌళి లాంటి దర్శకుడికి అస్సలు తగదని ఆరోపించింది. అల్లూరి సీతారామరాజు 1897లో విశాఖపట్టణం పాండ్రంకిలో పుట్టగా.. కొయ్యూరు మండలం రాజేంద్రపాలెంలో 1924 మే 7న తెల్లవారి కాల్పుల్లో వీరమరణం పొందారు. అదే సమయంలో కొమురం భీమ్ 1901లో జన్మించి 1941లో మరణించారని చరిత్ర చెబుతోంది. ఈ ఇద్దరికి పరిచయం ఉన్నట్లు కానీ.. స్నేహం ఉన్నట్లు కానీ చరిత్రలో ఎక్కడా లేదని.. అసలు చరిత్రలో లేని విషయాలను సినిమాలో చూపించడం సరైన పద్ధతి కాదంటున్నారు అల్లూరి అభిమానులు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Prabhas: మరోసారి మంచి మనసు చాటుకున్న డార్లింగ్.. అభిమాని కుటుంబానికి ఆర్థిక సాయం..

Viral Photo: బోసినవ్వుతో మాయచేస్తున్న చిలిపి కళ్ల చిన్నారి.. ఫస్ట్ మూవీతోనే కుర్రాళ్ల ఫేవరేట్ హీరోయిన్.. గుర్తుపట్టేయ్యండి..

Ajith Kumar: 30 ఇయర్స్ ఇండస్ట్రీ..  “జీవించండి.. జీవించనివ్వండి” అంటూ ఫ్యాన్స్‏కు హేటర్స్‏కు హీరో అజిత్ స్పెషల్ మేసేజ్..