Ajith Kumar: 30 ఇయర్స్ ఇండస్ట్రీ..  “జీవించండి.. జీవించనివ్వండి” అంటూ ఫ్యాన్స్‏కు హేటర్స్‏కు హీరో అజిత్ స్పెషల్ మేసేజ్..

తమిళ్ స్టార్ హీరో అజిత్ (Ajith Kumar).. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. దక్షిణాది సినీ పరిశ్రమలో ఈ స్టార్ హీరోకు ఉన్న

Ajith Kumar: 30 ఇయర్స్ ఇండస్ట్రీ..  జీవించండి.. జీవించనివ్వండి అంటూ ఫ్యాన్స్‏కు హేటర్స్‏కు హీరో అజిత్ స్పెషల్ మేసేజ్..
Ajith
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 15, 2022 | 12:15 PM

తమిళ్ స్టార్ హీరో అజిత్ (Ajith Kumar).. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. దక్షిణాది సినీ పరిశ్రమలో ఈ స్టార్ హీరోకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. తెలుగు..తమిళంలో అజిత్‏ను అభిమానించే వారి సంఖ్య ఎక్కువే. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, హిందీ భాషలలో అజిత్ అనర్గళంగా మాట్లాడగలడు. అంతేకాకుండా.. నాలుగు పదుల వయసులోనూ ఇప్పటికీ జుట్టుకు రంగు వేసుకోకుండా న్యాచురల్ లుక్కుతో హీరోగా నటిస్తున్నాడు. ప్రేమ పుస్తకం సినిమాతో కెరీర్ ఆరభించిన అజిత్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఇటీవల వలిమై మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది. ఇక ఈరోజుతో అజిత్ చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి 30 సంవత్సరాలు పూర్తైంది.

ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి ముప్పై సంవత్సరాలు పూర్తైన సందర్భంగా.. ఫ్యాన్స్.. హేటర్స్.. ఇతరులకు సోషల్ మీడియా వేదికగా స్పెషల్ మేసేజ్ చేశారు అజిత్.. తన పర్సనల్ మేనేజర్ సురేష్ చంద్ర తన ట్విట్టర్ ఖాతాలో ఈ మేసేజ్ షేర్ చేశారు. ” ఫ్యాన్స్.. హేటర్స్.. న్యూట్రల్స్.. ఒకే నాణేనికి 3 వైపులా ఉంటారు. నేను అభిమానుల నుంచి ప్రేమను.. ద్వేషించే వారి నుంచి ద్వేషాన్ని..న్యూట్రల్స్ నుంచి నిష్పాక్షిక అభిప్రాయాలను దయతో అంగీకరిస్తున్నాను.. జీవించండి.. జీవించనివ్వండి.. అన్ కండిషనర్ లవ్ ఫర్ ఎవర్ ! అజిత్ కుమార్ ” అంటూ స్పెషల్ నోట్ చేశారు. ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం అజిత్ వలిమై సినిమా దర్శకుడు హెచ్ వినోద్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు.

Also Read: Ajith: అజిత్‌ గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు

Radhe Shyam: వెజిటేరియన్ హోటల్‏కు వెళ్లి చికెన్ బిర్యానీ కావాలంటే ఎలా ?.. రాధేశ్యామ్ డైరెక్టర్ అసంతృప్తి..

Singer Chinmayi: ప్రధాని కావాలని కోరిన అభిమాని.. అదే వరస్ట్ ప్రపంచంలోనే టఫ్ అంటూ రిప్లై ఇచ్చిన సింగర్..

ఈ బ్లడ్ గ్రూపు ఉన్నవారు చాలా మందికి రోల్ మోడల్స్.. ప్రేమ.. పెళ్లి వీరి జీవితంలో ఎలా ఉంటాయంటే..