Radhe Shyam: వెజిటేరియన్ హోటల్‏కు వెళ్లి చికెన్ బిర్యానీ కావాలంటే ఎలా ?.. రాధేశ్యామ్ డైరెక్టర్ అసంతృప్తి..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas).. పూజా హెగ్డే జంటగా నటించిన లేటేస్ట్ చిత్రం రాధేశ్యామ్ (Radhey Shyam). మార్చి 11న విడుదలైన ఈ మూవీ

Radhe Shyam: వెజిటేరియన్ హోటల్‏కు వెళ్లి చికెన్ బిర్యానీ కావాలంటే ఎలా ?.. రాధేశ్యామ్ డైరెక్టర్ అసంతృప్తి..
Radha Krishna Kumar
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 15, 2022 | 11:07 AM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas).. పూజా హెగ్డే జంటగా నటించిన లేటేస్ట్ చిత్రం రాధేశ్యామ్ (Radhey Shyam). మార్చి 11న విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్‏తో దూసుకుపోతుంది. విడుదలైన మూడు రోజుల్లో రికార్డ్స్ స్థాయిలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అయితే మొదట్లో ఈ సినిమాపై మిక్స్డ్ టాక్ వచ్చింది. కొందరు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటుంటే.. మరి కొందరు మాత్రం ప్లాప్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో ప్రభాస్ మాస్ యాంగిల్‏లో కనిపించకపోవడం.. యాక్షన్స్ లేకపోవడంతో కొందరు అభిమానులు నిరాశకు గురయ్యారు. దాదాపు మూడేళ్ల తర్వాత ప్రభాస్ వెండితెరపై కనిపించడంతో ఎంతో ఆత్రుతగా వచ్చిన మాస్ లవర్స్‏కు క్లాసీగా సాగిపోతున్న లవ్ స్టోరీ పై పెదవి విరిచారు. దీంతో నెట్టింట్లో రాధేశ్యామ్ సినిమాపై ట్రోలింగ్ జరిగింది. ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. ప్రొడ్యూసర్ ట్రోల్స్ చేసే వారికి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. తాజాగా రాధేశ్యామ్ సక్సెస్ మీట్‏లో డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ అసహనం వ్యక్తం చేశాడు..

దాదాపు రూ. 300 కోట్లు పెట్టి భారీ బడ్జెట్‏తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించిన సినిమా యాక్షన్ సీన్స్ లేకపోవడం పై ప్రభాస్ ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. కామెడీ.. ఫైట్స్ ఏమి లేవంటూ కామెంట్స్ చేస్తున్న వారికి స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చారు రాధాకృష్ణ కుమార్.. వెటిటేరియన్ హోటల్‏కు వెళ్లి చికెన్ బిర్యానీ పెడతారని ఎలా ఆశిస్తారు ? అని ప్రశ్నించాడు..అంతేకాకుండా.. రాధేశ్యామ్ ఇంటెన్సీవ్ లవ్ స్టోరీ అని ముందు నుంచే చెబుతున్నామని.. ఓ అందమైన ప్రేమకథ నుంచి ఇంకా ఏం ఆశిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇందులో ప్రభాస్ హస్తాసాముద్రికా నిపుణుడిగా.. పూజా హెగ్డే డాక్టర్ ప్రేరణ పాత్రలో నటించింది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. ఇందులో రెబల్ స్టార్ కృష్ణం రాజు.. జగపతి బాబు కీలకపాత్రలలో నటించారు.

Also Read: Jayamma Panchayathi: సుమ కనకాల పంచాయతీ పెట్టేది ఆ రోజునేనంట.. రిలీజ్ డేట్ ఫిక్స్

Kiran Abbavaram: జోరు పెంచిన యంగ్ హీరో.. కొత్త సినిమా మొదలు పెట్టేసిన కిరణ్ అబ్బవరం..

RRR Movie: అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ టీఎమ్‌.. ఎత్తర జెండా ఫుల్ సాంగ్‌ వచ్చేసింది..

Aamir Khan: మాజీ భార్యలతో బంధంపై బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు