Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jayamma Panchayathi: సుమ కనకాల పంచాయతీ పెట్టేది ఆ రోజునేనంట.. రిలీజ్ డేట్ ఫిక్స్

బుల్లితెర పై రాణిస్తున్న సుమ ఇప్పుడు వెండితెరపైనే సత్తా చాటడానికి రెడీ అయ్యారు. గతంలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెరిసిన సుమ ఆతరువాత సినిమాకు గ్యాప్ ఇచ్చి బుల్లితెరపై సందడి చేస్తున్నారు.

Jayamma Panchayathi: సుమ కనకాల పంచాయతీ పెట్టేది ఆ రోజునేనంట.. రిలీజ్ డేట్ ఫిక్స్
Suma Kanakala
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 14, 2022 | 8:46 PM

Jayamma Panchayathi: బుల్లితెర పై రాణిస్తున్న సుమ ఇప్పుడు వెండితెరపైనే సత్తా చాటడానికి రెడీ అయ్యారు. గతంలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెరిసిన సుమ ఆతరువాత సినిమాకు గ్యాప్ ఇచ్చి బుల్లితెరపై సందడి చేస్తున్నారు. చాలా కాలం తర్వాత ఇప్పుడు జయమ్మ పంచాయితీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. యాంకర్ గానే కాకుండా బుల్లితెర రియాలిటీ షోల నిర్మాతగానూ సత్తా చాటుతున్నారు సుమ. తాజాగా జయమ్మ పంచాయితీ విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. సమ్మర్‌లో వచ్చే సినిమాల‌ను చూసుకుని చివరకు ఏప్రిల్ 22తో విడుద‌ల‌కు ఫిక్స్ అయినట్టు ఓ వీడియో ద్వారా వారు తేదీని ప్రకటించారు. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించిన ఈ పల్లెటూరి డ్రామా చిత్రం టీజర్, పాటలతో చాలా ఆసక్తిని రేకెత్తించింది. వారు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లతో ముందుకు రావడం ద్వారా ప్రమోషన్‌లను చేస్తున్నారు.

ఇటీవ‌లే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయగా, నేచురల్ స్టార్ నాని ఫస్ట్ సింగిల్, హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను కూడా ఆవిష్క‌రించారు.  ఎవరికీ, దేనికీ లొంగని స్వార్థపూరితమైన పల్లెటూరి మహిళగా సుమ నటించింది. ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, అనూష్ కుమార్ సినిమాటోగ్రాఫర్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bahubali 3: మాహిష్మతి రాజ్యం నుంచి కొత్త వార్త రానుంది.. బాహుబలి 3పై జక్కన్న ఆసక్తికర వ్యాఖ్యలు..

హర్మోనియం మెట్ల మీద ఆయన చేతి వేళ్లు కదిలితే చాలు సప్తస్వరాలు తుళ్లిపడేవి!

NTR: అన్న గారి ఫొటో వెనుక గమ్మత్తైన విషయం దాగి ఉంది.. ఏంటో గుర్తు పట్టండి..