AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bahubali 3: మాహిష్మతి రాజ్యం నుంచి కొత్త వార్త రానుంది.. బాహుబలి 3పై జక్కన్న ఆసక్తికర వ్యాఖ్యలు..

Bahubali 3: బాహుబలి (Bahubali).. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగు సినిమా స్థాయినే కాకుండా, యావత్‌ ఇండియన్‌ ఫిలిమ్‌ ఇండస్ట్రీ స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిందీ సినిమా. ప్రభాస్‌ (Prabhas)ను పాన్‌ ఇండియా హీరోగా మార్చేసింది...

Bahubali 3: మాహిష్మతి రాజ్యం నుంచి కొత్త వార్త రానుంది.. బాహుబలి 3పై జక్కన్న ఆసక్తికర వ్యాఖ్యలు..
Rajamouli About Bahubali 3
Narender Vaitla
|

Updated on: Mar 14, 2022 | 2:47 PM

Share

Bahubali 3: బాహుబలి (Bahubali).. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగు సినిమా స్థాయినే కాకుండా, యావత్‌ ఇండియన్‌ ఫిలిమ్‌ ఇండస్ట్రీ స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిందీ సినిమా. ప్రభాస్‌ (Prabhas)ను పాన్‌ ఇండియా హీరోగా మార్చేసింది. మాహిష్మతి అనే రాజ్యాన్ని సృష్టించి ప్రేక్షకులకు సరికొత్త ప్రపంచాన్ని చూపించిన ఘనత రాజమౌళిది. రెండు పార్టులుగా విడుదలైన ఈ సినిమా అత్యంత భారీ కలెక్షన్లను రాబట్టి ఇండియన్‌ సినిమా హిస్టరీలోనే సరికొత్త రికార్డులను తిరగరాసింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ఇప్పుడు మూడో పార్ట్‌ రానుందా.? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా దర్శన ధీరుడు రాజమౌళి చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం.

ఇంతకీ విషయమేంటంటే.. ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో బాహుబలి 3పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాహుబలి చిత్రానికి కొనసాగింపుగా మరో చిత్రం రానుందా.? అన్న ప్రశ్నకు జక్కన్న స్పందిస్తూ.. ‘తప్పకుండా రొవొచ్చు. బాహుబలి చుట్టూ జరిగే ఎన్నో సంఘటనలు ఈసారి మీకు చూపించనున్నాం. దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఇందుకు మా నిర్మత శోభు యార్లగడ్డ కూడా సుముఖంగా ఉన్నారు. అయితే దీనికి కాస్త సమయం పడుతుండొచ్చు. కానీ బాహుబలి రాజ్యం నుంచి కచ్చితంగా ఆసక్తికరమైన వార్త రానుంది’ అని రాజమౌళి చెప్పుకొచ్చారు.

దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బాహుబలి నుంచి మరో సీక్వెల్‌ రానుందనడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా తమ అభిమాన హీరోను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన బాహుబలికి సీక్వెల్ అనడంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఈ వార్తను తెగ ట్రెండింగ్‌ చేస్తున్నారు. అయితే ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత మహేష్‌ బాబుతో సినిమా చేయనున్న రాజమౌళి ఆ తర్వాత బాహుబలి 3ని పట్టాలెక్కిస్తారా.? చూడాలి. అలాగే ప్రస్తుతం చేతిలో నాలుగు సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్‌ రాజమౌళి చిత్రానికి ఎప్పుడు డేట్స్‌ ఇస్తారో కూడా చూడాలి.

Also Read: AP Crime News: ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై కన్ను.. ఇద్దరు స్నేహితులతో కలిసి..

Mancherial: మంచిర్యాల జిల్లాలో దారుణం.. ఎమ్మార్వో కార్యాలయంలోనే వీఆర్‌ఏ దారుణ హత్య..

Mancherial: మంచిర్యాల జిల్లాలో దారుణం.. ఎమ్మార్వో కార్యాలయంలోనే వీఆర్‌ఏ దారుణ హత్య..

Follow Us
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
చీర కొనివ్వలేదని.. భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య!
చీర కొనివ్వలేదని.. భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య!
ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా? 99% మందికి తెలియదు
ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా? 99% మందికి తెలియదు
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!
కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ షాక్..ముంబై పీఎస్‌లో కొత్త కంప్లైంట్
కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ షాక్..ముంబై పీఎస్‌లో కొత్త కంప్లైంట్