AP Crime News: ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై కన్ను.. ఇద్దరు స్నేహితులతో కలిసి..

Rape Case: అభం శుభం తెలియని మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి.. ఒక్కరు కాదు ఇద్దరు ముగ్గురు అత్యాచారం చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపింది. గుంటూరు జిల్లాలో

AP Crime News: ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై కన్ను.. ఇద్దరు స్నేహితులతో కలిసి..
rape case
Follow us

|

Updated on: Mar 14, 2022 | 1:31 PM

Rape Case: అభం శుభం తెలియని మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి.. ఒక్కరు కాదు ఇద్దరు ముగ్గురు అత్యాచారం చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపింది. గుంటూరు జిల్లాలోని పెదకాకానికి చెందిన ఓ బాలిక ఎనిమిదో తరగతి చదువుతోంది. శని, ఆదివారం సెలవులు రావడంతో ఇంటి వద్దనే ఉంది. ఈ విషయాన్ని ఇంటి పక్కన ఉండే యువకుడు బ్రహ్మం గమనించాడు. బిటెక్ చదువుతున్న బ్రహ్మం.. బాలికను అత్యాచారం చేయాలని ప్రణాళిక రచించాడు. ఇదే విషయాన్ని అతని స్నేహితులైన బాజీ వర ప్రసాద్, నరసింహారావులకు చెప్పాడు. ముగ్గురూ కలిసి బాలికను అత్యాచారం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ముందుగా బ్రహ్మం బాలిక ఇంటికి వెళ్ళాడు. బాలికకు మాయమాటలు చెప్పి పక్కన ఉన్న అతని ఇంటికి తీసుకెళ్ళాడు. అప్పటికే బ్రహ్మం ఇంట్లో ఇద్దరు స్నేహితులు ఉన్నారు.

ఇంటి లోపలకు వెళ్లగానే.. ముగ్గురూ కలిసి ముందుగా బాలిక అరవకుండా నోట్లో వస్త్రం కుక్కారు. అనంతరం ముగ్గురూ ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం బాలికను అక్కడ నుంచి పంపించి వేశారు. అయితే.. బాలిక ప్రవర్తనపై అనుమానం వచ్చిన తల్లి.. ప్రశ్నించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వైద్యుల నివేదిక అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

-టి నాగరాజు, టీవీ9 తెలుగు రిపోర్టర్, గుంటూరు.

Also Read:

Vijayawada: బెజవాడలో దారుణం.. హోటల్‌కు తీసుకెళ్లి భార్యను చంపిన భర్త

Vizianagaram: ప్రిన్సిపాల్ మందలించారని మనస్తాపం.. స్కూల్‌లోనే చెట్టుకు ఉరేసుకున్న విద్యార్థి..

భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??