AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mancherial: మంచిర్యాల జిల్లాలో దారుణం.. ఎమ్మార్వో కార్యాలయంలోనే వీఆర్‌ఏ దారుణ హత్య..

మంచిర్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కన్నెపల్లి తహశీల్దార్‌ కార్యాలయంలో ఓ వీఆర్ఏ దారుణ హత్యకు గురవడం స్థానికంగా సంచలనం సృష్టించింది.

Mancherial: మంచిర్యాల జిల్లాలో దారుణం.. ఎమ్మార్వో కార్యాలయంలోనే వీఆర్‌ఏ దారుణ హత్య..
Basha Shek
|

Updated on: Mar 14, 2022 | 11:57 AM

Share

మంచిర్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కన్నెపల్లి తహశీల్దార్‌ కార్యాలయంలో ఓ వీఆర్ఏ దారుణ హత్యకు గురవడం స్థానికంగా సంచలనం సృష్టించింది. మృతుడు దుర్గంబాబు(50) కొత్తపల్లి వీఆర్‌ఏగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల (Mancherial) జిల్లాలోని కన్నెపల్లి తహశీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న దుర్గం బాబును గుర్తు తెలియని దుండగులు కత్తితో గొంతు కోసి చంపారు. రక్తం మడుగులో పడి ఉన్న బాబును చూసి స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ప్రాథమిక ఆధారాలు సేకరించి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా కొత్తపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గత కొన్ని రోజులుగా దుర్గంబాబును చంపేస్తాడని బెదరిస్తున్నారని, దీనిపై స్థానిక పోలీస్‌ స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేశామని హతుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అతనే బాబును హత్య చేసి ఉంటాడని వారు ఆరోపిస్తున్నారు. కాగా వ్యక్తిగత కక్షలతోనే ఈ హత్య జరిగిందా? లేదంటే రెవెన్యూ అధికారుల గొడవలతో జరిగిందా? అనే కోణాల్లో పోలీసులు విచారణ ప్రారంభించారు.

Also Read: Jangareddygudem: వరుస మరణాలపై హీటెక్కుతున్న ఏపీ రాజకీయాలు.. టీడీపీ ఆందోళనతో అసెంబ్లీ వాయిదా

CWC: సీడబ్యూసీ సమావేశంలో ఏం జరిగింది..? ఆసక్తికర విషయాలను వెల్లడించిన సీనియర్ నేత..

Fingernails Bite: గోర్లు కొరుకుతున్నారా ? అయితే మీకు ఈ వ్యాధులు ఉన్నట్టే.. అవేంటంటే..

మహాశివరాత్రి.. ఈరోజు శివుడికి ఆగ్రహం తెప్పించే ఈ తప్పులు చేయొద్దు
మహాశివరాత్రి.. ఈరోజు శివుడికి ఆగ్రహం తెప్పించే ఈ తప్పులు చేయొద్దు
స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్‌‌
స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్‌‌
UPSC సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్ మారాయ్‌! కొత్త పద్ధతులు ఇవే
UPSC సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్ మారాయ్‌! కొత్త పద్ధతులు ఇవే
టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్
టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్
ప్రపోజ్ డే.. ఇలా ప్రపోజ్ చేస్తే ఏ పిల్లైనా పడాల్సిందే గురూ..
ప్రపోజ్ డే.. ఇలా ప్రపోజ్ చేస్తే ఏ పిల్లైనా పడాల్సిందే గురూ..
మెడికల్ వర్సిటీలో కత్తితో దాడికి తెగబడ్డ 15 ఏళ్ల కుర్రాడు..!
మెడికల్ వర్సిటీలో కత్తితో దాడికి తెగబడ్డ 15 ఏళ్ల కుర్రాడు..!
కులాంతర వివాహం చేసుకున్న కూతురు.. తండ్రి ఏం చేశాడో తెలిస్తే..
కులాంతర వివాహం చేసుకున్న కూతురు.. తండ్రి ఏం చేశాడో తెలిస్తే..
24 ఏళ్లుగా ఒక్క హిట్టు లేదు.. అయినా వరుసగా 4 నేషనల్ అవార్డ్స్..
24 ఏళ్లుగా ఒక్క హిట్టు లేదు.. అయినా వరుసగా 4 నేషనల్ అవార్డ్స్..
మహాశివరాత్రి నాడు ఏర్పడే 3 రాజయోగాలు.. ఈ రాశుల వారికి మహార్ధశ..
మహాశివరాత్రి నాడు ఏర్పడే 3 రాజయోగాలు.. ఈ రాశుల వారికి మహార్ధశ..
నేడు నిప్పుల వర్షమే..మూడు మ్యాచ్‌లు..ఆరు జట్లు..గెలిచేదెవరు?
నేడు నిప్పుల వర్షమే..మూడు మ్యాచ్‌లు..ఆరు జట్లు..గెలిచేదెవరు?