AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NTR: అన్న గారి ఫొటో వెనుక గమ్మత్తైన విషయం దాగి ఉంది.. ఏంటో గుర్తు పట్టండి..

Nandamuri Taraka Rama Rao: అటు మహా నటుడు.. ఇటు మహా నేతగా తెలుగువారి గుండెల్లో చెరగని ముద్రవేశారు నందమూరి తారక రామారావు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నలుదిక్కులా చాటిచెప్పి..

NTR: అన్న గారి ఫొటో వెనుక గమ్మత్తైన విషయం దాగి ఉంది.. ఏంటో గుర్తు పట్టండి..
Ntr
Shaik Madar Saheb
|

Updated on: Mar 14, 2022 | 2:16 PM

Share

Senior NTR hand painting: అటు మహా నటుడు.. ఇటు మహా నేతగా తెలుగువారి గుండెల్లో చెరగని ముద్రవేశారు నందమూరి తారక రామారావు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నలుదిక్కులా చాటిచెప్పి.. ఎన్టీఆర్ (Nandamuri Taraka Rama Rao) దేశంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, నటరత్నగా సీనియర్ ఎన్టీఆర్ ఎన్నో అవార్డులను, కీర్తి ప్రతిష్టలను సంపాదించుకున్నారు. దాదాపు 300 పైగా చిత్రాలలో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించి విశ్వ విఖ్యాత నట సార్వభౌముడిగా చరిత్రలో నిలిచారు. పద్మశ్రీ నందమూరి తారక రామారావు 1923 మే 28న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా, పామర్రు మండలం నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య చౌదరి, వెంకట రామమ్మ దంపతులకు జన్మించారు. 18 జనవరి 1996లో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. విశ్వనటుడిగా, చిత్రనిర్మాతగా, రాజకీయ నాయకుడిగా రాణించారు. మూడు పర్యాయాలు ఏడు సంవత్సరాలపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్.. అనతి కాలంలోనే ప్రభుత్వాన్ని కైవసం చేసుకున్నారు.  ఎన్టీఆర్ సీఎంగా 1983, 84, 85, 94 లలో మొత్తం నాలుగుసార్లు ప్రమాణ స్వీకారం చేశారు.

అన్నగా తెలుగువారి అభిమానాన్ని చూరగొన్న ఎన్టీఆర్‌కు సంబంధించిన ఒక గమ్మత్తైన చిత్రలేఖనం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసి అన్నగారి అభిమానులతోపాటు అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ ఫొటో విశేషం ఏమిటంటే.. ఎన్టీఆర్ సినిమాల పేర్లతో ఆయన చిత్రాన్ని ప్రత్యేకంగా గీశారు. ఆయనకు అక్షర నివాళులర్పిస్తూ గీసిన చిత్రలేఖనం.. ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది.

ఎన్టీఆర్ ఫొటో..

Ntr

Ntr

ఈ ఫొటో చూసి అభిమానులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. అన్నగారి సినిమా పేర్లతో ఉన్న ఈ ఫొటో అద్భుతంగా ఉందంటూ కొనియాడుతున్నారు. ఈ ఫొటో జూమ్ చేస్తే.. ఆయన నటించిన సినిమాల పేర్లన్నీ కనిపిస్తాయి.

Also Read:

Viral Photo: ఈ ఫొటోలో ముఖ్యమంత్రి ఉన్నారు.. యూత్ ఐకానిక్ ఈయనే.. గుర్తుపడితే మీరు జీనియస్..

Viral Video: సింహానికి చుక్కలు చూపించిన గేదేలు.. వేటాడాలనుకుంటే.. దిమ్మతిరిగే షాకిచ్చాయి..