Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WIFI Signal: వైఫై సిగ్నల్ సరిగ్గా రావడం లేదా… అయితే ఈజీగా ఇలా బూస్ట్ చేయండి

WIFI Signal: ఈ రోజుల్లో ఇంటర్నెట్(Internet) వినియోగించని ఇల్లు లేదంటే అతిశయోక్తనే చెప్పాలి. ప్రతి ఒక్కరి దగ్గరా స్మార్ట్ ఫోన్(Smart Phones) అవసరంగా మారిపోయింది.

WIFI Signal: వైఫై సిగ్నల్ సరిగ్గా రావడం లేదా... అయితే ఈజీగా ఇలా బూస్ట్ చేయండి
Wifi
Follow us
Ayyappa Mamidi

| Edited By: Ram Naramaneni

Updated on: Mar 14, 2022 | 3:03 PM

WIFI Signal: ఈ రోజుల్లో ఇంటర్నెట్(Internet) వినియోగించని ఇల్లు లేదంటే అతిశయోక్తనే చెప్పాలి. ప్రతి ఒక్కరి దగ్గరా స్మార్ట్ ఫోన్(Smart Phones) అవసరంగా మారిపోయింది. ఆధునిక కాలంలో ప్రతి అవసరానికీ సెల్ ఫోన్ తప్పని సరి అవుతోంది. దీని వల్ల చాలామంది తమ అవసరాల కోసం వైఫై రూటర్లను అమర్చుకుంటున్నారు. మీ స్మార్ట్ ఫోన్ ను వైఫైకి అనుసంధానించినప్పుడు సిగ్నల్ తక్కువగా వస్తోందా.. అయితే సింపుల్ గా ఇలా చేసి వైఫై సిగ్నల్ ను బూస్ట్ చేసుకోండి. ఇంటర్నెట్ వినియోగంలో అంతరాయం కలిగినప్పుడు ముందుగా మీ వైఫై రూటర్ ను రీసెట్ చేయండి. దీనికోసం ముందుగా మీరు వైఫై రూటర్ పవర్ సప్లై నిలిపివేసి.. ప్లగ్ తొలగించి దానిని కొన్ని నిమిషాల పాటు అలా వదిలేయాలి.

ఆ తరువాతే దానిని తిరిగి రీస్టార్ట్ చేయాలి. మీ మెుబైల్ ఫోన్ కు రూటర్ ను దగ్గరగా ఉంచాలి. ఎందుకంటే రూటర్ దూరంగా ఉండటం వల్ల మధ్యలో అనేక వస్తువులు సిగ్నల్ కు అంతరాయం కలిగిస్తుంటాయి. అందువల్ల వీటి మధ్య ఉండే దూరాన్ని వీలైనంత తగ్గిచటం మంచిది. ఇదే సమయంలో మీ స్మార్ట్ ఫోన్ ను కూడా స్విచ్ఛాఫ్ చేయాలి. ఆ తరువాత కొత్తగా మళ్లీ రూటర్ కు దానిని అనుసంధానించటం వల్ల వైఫై స్పీడ్ సమస్య పరిష్కరింపబడుతుంది. ఇందులో భాగాంగా మీరు సైవిడ్ వైఫై నెట్ వర్క్స్ లో నుంచి రూటర్ ను డిలీట్ చేసి తిరిగి యాడ్ చేయాలి. ఇది సిగ్నల్ మెరుగుపడటానికి ఉపకరిస్తుంది.

ఇవీ చదవండి..

LPG Cylinder: గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. సిలిండర్ రూ. 634కే అందిస్తున్న ఆ కంపెనీ..!

Cheapest Electric Car: ఎలక్ట్రిక్ కార్ ప్రియులకు శుభవార్త.. అత్యంత తక్కువ ధరలో MG E230..