LPG Cylinder: గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. ఆ సిలిండర్ రూ. 634కే అందిస్తున్న ఆ కంపెనీ..!
LPG Cylinder: హోలీకి ముందుగానే ఆ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలనుకునే వినియోగదారులకు శుభవార్త. కేవలం రూ. 634 కే ఎల్‌పీజీ సిలిండర్ ను కొనుగోలు చేసేందుకు వారికి అవకాశం దక్కనుంది.
LPG Cylinder: హోలీకి ముందుగానే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలనుకునే ఆ వినియోగదారులకు శుభవార్త. కేవలం రూ. 634 కే ఎల్‌పీజీ సిలిండర్ ను కొనుగోలు చేసేందుకు వారికి అవకాశం దక్కనుంది. ద్రవ్యోల్బణం కారణంగా అన్ని వస్తువుల ధరలూ పెరుగుతున్న ఈ సమయంలో ప్రభుత్వ రంగానికి చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ తక్కువ ఖర్చులో గ్యాస్ సిలిండర్ పొందే అవకాశాన్ని కాంపోజిట్ సిలిండర్ల వినియోగదారులకు కల్పిస్తోంది.
కాంపోజిట్ సిలిండర్లు లైట్ గా ఉండటమే కాక తక్కువ ధర కలిగి ఉంటాయి. ఇది 14 కిలోల ఖాళీ సిలిండర్ కంటే తక్కువ బరువులో ఉంటాయి. కేవలం ఒక్కచేతితో వీటిని ఎత్తవచ్చు. ఈ కారణంగా దీనిని ఒక ప్రదేశం నుంచి మరొక చోటుకు ఈజీగా తీసుకెళ్లువచ్చు. ఇవి అస్సలు తుప్పుపట్టవు. పైగా ఇవి పేలవు కూడా. ఇవి ట్రాన్పరెంట్ గా ఉండటం వల్ల లోపల గ్యాస్ ఎంత ఉందనే విషయాన్ని వినియోగదారులు గమనించవచ్చు. మార్చి 1న ఎల్‌పీజీ సిలిండర్ ధరను పెంచిన సంగతి తెలిసిందే. గ్యాస్ కంపెనీలు కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల ధరను రూ.105 పెంచగా.. ఇప్పుడు దిల్లీలో వాటి ధరలు రూ.2,012, ముంబైలో రూ.1,963, కోల్‌కతాలో రూ.2,095 గా ఉన్నాయి.
ఇవీ చదవండి..
Vehicle Registration: ఆ వాహనాల రెజిస్ట్రేషన్ రేట్ల పెంపు.. అక్కడి వాహనదారులకు వెసులుబాట్లు..
Money Saving Ideas: డబ్బు సేవ్ చేయటంలో ఈ టిప్స్ పాటించండి.. ఆర్థిక మెరుగుదలకు ఇలా చేయండి..