Money Saving Ideas: డబ్బు సేవ్ చేయటంలో ఈ టిప్స్ పాటించండి.. ఆర్థిక మెరుగుదలకు ఇలా చేయండి..
Money Saving Ideas: ప్రతి ఒక్కరి జీవితంలో సేవింగ్స్ అనేవి చాలా ముఖ్యమైన అంశం. ఎంత సంపాదించామన్న(Earnings) దానికి తోడు.. దానిని ఎలా ఖర్చుచేస్తున్నాం.. ఎంత పొదుపు చేశామన్నది ముఖ్యమైన విషయం.
Money Saving Ideas: ప్రతి ఒక్కరి జీవితంలో సేవింగ్స్ అనేవి చాలా ముఖ్యమైన అంశం. ఎంత సంపాదించామన్న(Earnings) దానికి తోడు.. దానిని ఎలా ఖర్చుచేస్తున్నాం.. ఎంత పొదుపు చేశామన్నది ముఖ్యమైన విషయం. కొంత మంది ఎక్కువ మొత్తంలో సంపాదించినా పొదుపు చేయడంలో విఫలమవుతుంటారు. ఆర్థిక వనరులను సరిగా వినియోగించుకోకపోతే అది అప్పులు(Loans) చేయటానికి కారణమౌతుంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేసే ఖర్చుల్లో కొంత మెుత్తాన్ని ఎలా మిగుల్చుకోవాలి, ఎలా పెట్టుబడి పెట్టాలి అనే కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
జీవితంలో వీలైనంత త్వరగా పొదుపు ప్రారంభించండి. సంపాదన ప్రారంభమైన కొత్తలో ఆదాయం తక్కువగా ఉండొచ్చు. అలాంటి సమయంలోనూ ఎంతో కొంత పొదుపు చేయడం వల్ల పొదుపు చేయటాన్ని అలవాటుగా మార్చుకోవచ్చు. చాలామంది.. సాధారణంగా వచ్చిన ఆదాయం నుంచి ఖర్చులు పోనూ మిగిలిన మొత్తాన్ని పొదుపు చేస్తుంటారు. అయితే ఈ పద్ధతి క్రమంగా మీ పొదుపు అలవాటును దెబ్బతీస్తుంది. ఒకవేళ నెలలో ఖర్చులు పెరిగితే.. ఆ నెల పొదుపు తగ్గిపోతుంది. అలా కాకుండా వచ్చిన ఆదాయం నుంచి మీరు ఎంత మెుత్తాన్ని దాయాలనుకుంటున్నారో దానిని ముందుగా తీసి పక్కన పెట్టాలి. ఆ తరువాతే మిగిలిన మెుత్తాన్ని రోజు వారీ అవసరాలకు వినియోగించాలి. దీనికి తోడు బ్యాంకు ఖాతాలను సైతం ఓ కంట కనిపెడుతూ ఉండాలి. నెలవారీగా స్టేట్‌మెంట్ తీసుకుని పరిశీలించాలి. అదనంగా ఏవైనా కారణాల రీత్యా ఛార్జీలను బ్యాంకులు వసూలు చేస్తున్నాయేమో గమనించాలి. ఒకవేళ అలాంటివి గమనిస్తే వాటిని వెంటనే సరిచేసుకోవాలి. వినియోగించకుండా అధనంగా బ్యాంకు ఖాతాలు ఉన్నట్లయితే వాటిని వెంటనే మూసివేయటం మంచిది.
ఆర్థికంగా మీపై ఆధారపడిన సభ్యులు ఉంటే.. టర్మ్ ప్లాన్ ద్వారా తగినంత కవరేజ్‌తో ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోండి. దీనికి తోడు కుటుంబంలోని వారందరికీ బీమా పాలసీ తీసుకోవటం ఉత్తమం. ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు ముందుగా తీసుకున్న ఈ జాగ్రత్త వారికి ఎంతగానో అండగా నిలుస్తుందని మరిచిపోకండి. క్రెడిట్ కార్డు చెల్లింపుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది తమకు వచ్చే ఆదాయానికంటే క్రెడిట్ కార్డును ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఈ క్రమంలో మెుత్తం ఒకేసారి చెల్లించలేక.. కొంత మెుత్తాన్ని చెల్లించి మిగిలినది తరువాతి నెలకు బదిలీ చేస్తుంటారు. ఇలా చేయటం వల్ల ఎక్కువ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. దీనకి తోడు మీ క్రెడిట్ స్కోర్ సైతం భారీగా దెబ్బతింటుంది. అందువల్ల సమయానికి బిల్లు మెుత్తం చెల్లించేందుకు ఏర్పాటు చేసుకోవటం ఉత్తమం.
హౌసింగ్ లోన్ తీసుకునేటప్పుడు నెలవారీ చెల్లింపు మెుత్తాన్ని తగ్గించుకునేందుకు చాలా మంది ఎక్కువ కాలానికి లోన్ తీసుకుంటుంటారు. కానీ.. అలా చేయటం వల్ల వడ్డీ రూపంలో ఎక్కువ భాగం చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల వీలైనంత వరకు లోన్ సొమ్మును తక్కువ కాల వ్యవధిలో చెల్లించే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవటం చాలా మంచిది. దీని వల్ల ఆర్థిక భారం తగ్గటమే కాక ఇల్లు తక్కువ కాలంలోనే మీ సొంతం అవుతుంది. దీనికి తోడు ఆన్ లైన్ ద్వారా మన రోజు వారీ చెల్లింపులు చేయటం ద్వారా సమయం, ఖర్చు రెంటినీ అదా చేసుకోవచ్చు. ఇలా వీలైనన్ని మార్గాల్లో డబ్బును పొదుపు చేయటం, ఆర్థిక క్రమశిక్షణను పాటించటం వంటి వాటి వల్ల ఎక్కువగా లాభపడవచ్చు.
ఇవీ చదవండి..
Facebook: ఇకపై మీ దుస్తులు మీరే ఉతుక్కోవాలంటూ ఉద్యోగులకు నోటీసు.. ఫేస్ బుక్ అలా ఎందుకు చేసిందంటే..