Facebook: ఇకపై మీ దుస్తులు మీరే ఉతుక్కోవాలంటూ ఉద్యోగులకు నోటీసు.. ఫేస్ బుక్ అలా ఎందుకు చేసిందంటే..
Facebook: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా(Meta) ఆర్థిక పరిస్థితి ఎలా ఉందనే విషయం కేవలం ఈ విషయం ఒక్కటి సరిపోతుంది. పైకి అంతా బాగున్నట్లే ఉన్నా.. కరోనా కారణంగా ఆర్థిత పరిస్థితులు దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Facebook: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా(Meta) ఆర్థిక పరిస్థితి ఎలా ఉందనే విషయం కేవలం ఈ విషయం ఒక్కటి సరిపోతుంది. పైకి అంతా బాగున్నట్లే ఉన్నా.. కరోనా కారణంగా ఆర్థిత పరిస్థితులు దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్ బెర్గ్(Mark Zuckerberg) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులకు అందిస్తున్న ప్రోత్సాహకాల విషయంలో ఆయన తీసుకున్న ఒక తాజా నిర్ణయం గురించి ప్రఖ్యాత న్యూయార్స్ టైమ్స్ ఒక స్టోరీని కూడా ప్రచురించింది.
అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలోని ప్రాంతం సిలికాన్ వ్యాలీ. అక్కడ దిగ్గజ టెక్ కంపెనీలైన గూగుల్, యాపిల్, ఫేస్‌బుక్ తో పాటు మరిన్ని ఉన్నాయి. ఈ టెక్ కంపెనీలన్నీ ఉద్యోగుల నుంచి అత్యుత్తమ ఫలితాలను రాబట్టేందుకు ఎక్కువ ప్రోత్సాహకాలను అందిస్తుంటాయి. కానీ.. కరోనా తరువాత ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. రానున్న కాలంలో ఆర్థిక ఇబ్బందులు రాకుండా మెటా కంపెనీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే.. ఉద్యోగులు ధరించే దుస్తులను ఉతకటం, వాటిని ఇస్త్రీ చేయటం లాంటి సౌకర్యాలను ఇకపై తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇతర ప్రోత్సాహకాలైన డిన్నర్ వేళల్లో మార్పులు, వ్యాలెట్ సేవలను కట్ చేయటం వంటి తాజా నిర్ణయాలను తీసుకుందని సదరు వార్తా సంస్థ వెల్లడించింది.
ఉద్యోగులకు తొలగించిన ప్రోత్సహకాలు కంపెనీకి తగ్గుతున్న ఆదాయానికి ముడిపడి ఉంది. ఫేస్‌బుక్ సంస్థ పేరును మెటాగా మార్చడం వల్ల కంపెనీ క్యాపిటలైజేషన్ పతనమైంది. ఈ కారణాల దృష్ట్యా జుకర్ బెర్గ్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే ప్రోత్సాహకాలను తగ్గించటానికి.. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ వ్యాల్యూ పడిపోవడానికి ఎటువంటి సంబంధం లేదని కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో ఉద్యోగుల ఆరోగ్యంతో పాటు ఇతర సెక్యూరిటీల విషయంలో అందించే నిధులను 300 డాలర్ల నుంచి 3000 డాలర్లకు పెంచినట్లు వారు చెబుతున్నారు.
ఇవీ చదవండి..
Bank Loan: సెకండ్ హ్యాండ్ కార్లపై రుణాలు.. ఏ బ్యాంకు ఎంత వడ్డీ ఉంటుందంటే..!