GST Scam: నకిలీ వే- బిల్లులతో టాక్స్ క్రెడిట్ కొట్టేశారు.. ఫాస్ట్ టాగ్ కార్డులను అలా ఉపయోగించి..

GST Scam: ఈ- వేబిల్లుల పరిశీలనలో కొత్త కుంభకోణం బయటపడింది. CGST దిల్లీ ఈస్ట్ కమిషనరేట్ దీనికి సంబంధించిన ఐదు సంస్థలను గుర్తించింది. ఈ సంస్థలు సంయుక్తంగా నకిలీ బిల్లులను వినియోగించి టాక్స్ క్రెడిట్ పొందాయని అధికారులు గుర్తించారు.

GST Scam: నకిలీ వే- బిల్లులతో టాక్స్ క్రెడిట్ కొట్టేశారు.. ఫాస్ట్ టాగ్ కార్డులను అలా ఉపయోగించి..
Gst Returns
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Mar 14, 2022 | 9:09 AM

GST Scam: ఈ- వేబిల్లుల పరిశీలనలో కొత్త కుంభకోణం బయటపడింది. CGST దిల్లీ ఈస్ట్ కమిషనరేట్ దీనికి సంబంధించిన ఐదు సంస్థలను గుర్తించింది. ఈ సంస్థలు సంయుక్తంగా నకిలీ బిల్లులను(Fake Bills) వినియోగించి టాక్స్ క్రెడిట్ పొందాయని అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో మరింత లోతుగా దర్యాప్తు చేస్తుండగా.. మరో రెండు కంపెనీల గుట్టురట్టయింది. ట్రక్ లకు సంబంధించిన ఫాస్ట్ టాగ్ కార్డులను కార్లకు అమర్చి దిల్లీ నుంచి ముంబయి పోర్టుకు సరకు రవాణా చేస్తున్నట్లు నకిలీ బిల్లులను నిందితులు సృష్టిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో గుజరాత్ జీఎస్టీ అధికారులు అందించిన సమాచారం మేరకు అహ్మదాబాద్ లో బ్లూ వాటర్ ఎక్స్పో ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన కారును వారు అడ్డుకున్నారు.

ఈ వ్యవహారంలో మహావీర్ ఇంటర్నేషనల్, గ్రావిటీ ఎంటర్ ప్రైజెస్ సంస్థలకు సంబంధించిన కార్యాలయాలు, యజమానుల నివాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఇలా ఫేర్ వే- బిల్లులను వినియోగించి సుమారు రూ. 85 కోట్ల మోసానికి నిందితుడు రాకేష్ కుమార్ జైన్ పాల్పడినట్లు జీఎస్టీ అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఈ నెల 10న ఆయనను అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పరిచారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఏడు కంపెనీలకు సంబంధించి దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని వారు తెలిపారు.

ఇవీ చదవండి..

Tax Alert: TDS అంటే ఏమిటో తెలుసా..? సమయానికి టాక్స్ కట్టకపోతే ఎంత TDS కట్ చేస్తారు..? పూర్తి వివరాలు..

ASSASSINATION: రాజీనామా చేయకుంటే చంపేస్తామంటూ ఆ ముఖ్యమంత్రికి బెదిరింపు.. 3 నెలలు డెడ్ లైన్..