Credit Card: మీరు క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా..? ఈ విషయాలను తప్పకుండా గుర్తించండి..!

Credit Card: క్రెడిట్‌ కార్డులు వాడే వారు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. కార్డులో డబ్బులు ఉన్నాయి కదా అని డబ్బులు ఇష్టానుసారంగా ఖర్చు చేసి గడువులోగా చెల్లించకుంటే తీవ్ర..

Credit Card: మీరు క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా..? ఈ విషయాలను తప్పకుండా గుర్తించండి..!
Credit Card
Follow us
Subhash Goud

|

Updated on: Mar 14, 2022 | 9:13 AM

Credit Card: క్రెడిట్‌ కార్డులు వాడే వారు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. కార్డులో డబ్బులు ఉన్నాయి కదా అని డబ్బులు ఇష్టానుసారంగా ఖర్చు చేసి గడువులోగా చెల్లించకుంటే తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వడ్డీ, ఇతర ఛార్జీలు అంటూ భారీగా వడ్డించనున్నాయి బ్యాంకులు (Banks). అందుకే క్రెడిట్‌ కార్డులు వాడే వారు జాగ్రత్తలు పాటించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఇక గడువులోగా బిల్లు (Bill) చెల్లించకపోతే క్రెడిట్‌ స్కోర్‌ తగ్గిపోయే అవకాశం ఉంది. మీరు భవిష్యత్తులో రుణాలు తీసుకునే సమయంలో ఆ ప్రభావం చూపే ప్రమాదం ఉంది. దీంతో సమయానికి బిల్లు చెల్లిస్తూ సరిగ్గా వాడుకుంటే రుణాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇలాంటి వారు కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే. రుణాలు తీసుకున్న వారు, క్రెడిట్‌ కార్డు ఉపయోగిస్తున్నవారి క్రెడిట్‌ స్కోర్‌ అనేది చాలా ముఖ్యం. క్రెడిట్‌ స్కోర్‌ (Credit Score)అనేది రుణగ్రహిత క్రెడిట్‌ విలువను సూచిస్తుంది. రుణాలుతీసుకున్న వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా క్రెడిట్‌ బ్యూరోలు క్రెడిట్‌ స్కోర్‌ అందిస్తాయి. క్రెడిట్ స్కోరు ఎక్కువగా ఉంటే, భవిష్యత్తులో త‌క్కువ రేట్లతో రుణం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేసే అంశాల‌ గురించి జాగ్రత్తగా ఉండటం ఎంతో అవసరం. రుణం లేదా క్రెడిట్ కార్డ్ బకాయిలు స‌మ‌యానికి చెల్లించ‌క‌పోతే మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ, మీ స్కోర్‌ను ప్రభావితం చేసే అనేక ఇతర అంశాలు ఉన్నాయి. వాటిపై అంద‌రికీ అవ‌గాహ‌న త‌క్కువ‌గా ఉంటుంది. అవి ఏంటంటే.. వేరొకరి రుణానికి మీరు హామీ ఇవ్వడం, మీ రుణాన్ని పునర్నిర్మించడం వంటివి.

అంతేకాకుండా కుటుంబ సభ్యులకు, బంధువుల‌కు హామీదారుగా ఉండ‌టం సర్వ సాధారణం. అయితే ఇలా తరచుగా చేయ‌డం వ‌ల‌న త‌మ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుంద‌నే విషయం చాలా మందికి తెలిసి ఉండదు. ఒక వేళ కొందరికి తెలిసినా పెద్దగా పట్టించుకోరు. అలాంటి వారికి భవిష్యత్తులో రుణాల విషయంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఇలా చేస్తే కొత్త రుణాల కోసం మీ సొంత‌ అర్హత తగ్గడమే కాదు, అసలు రుణగ్రహీతకు బ‌కాయిలు ఉన్నట్లయితే మీరు కూడా నష్టపోవచ్చు. ఎంత మొత్తం ఖర్చు చేసినా.. సమయానికి బిల్లు చెల్లిస్తే బెటర్‌.

ఇవి కూడా చదవండి:

Indian Railway: ప్రయాణికుల కోసం ఇండియన్‌ రైల్వే కీలక నిర్ణయం.. ఇక నుంచి మరింత ఆదాయం

PAN-Aadhaar: ఈ నెలాఖరులోగా ఈ పని చేయకుంటే పొరపాటు చేసినట్లే.. రూ.10 వేల జరిమానా

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..