PAN-Aadhaar: ఈ నెలాఖరులోగా ఈ పని చేయకుంటే పొరపాటు చేసినట్లే.. రూ.10 వేల జరిమానా

Pan-Aadhaar Link: మనకు ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు. ఇవి లేనివి పనులు జరగవు. ముఖ్యంగా బ్యాంకింగ్‌ లావాదేవిల విషయాలలో తప్పనిసరి...

PAN-Aadhaar: ఈ నెలాఖరులోగా ఈ పని చేయకుంటే పొరపాటు చేసినట్లే.. రూ.10 వేల జరిమానా
Follow us

|

Updated on: Mar 13, 2022 | 5:29 PM

Pan-Aadhaar Link: మనకు ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు. ఇవి లేనివి పనులు జరగవు. ముఖ్యంగా బ్యాంకింగ్‌ లావాదేవిల విషయాలలో తప్పనిసరి. పాన్‌ కార్డు లేనిది ఎలాంటి లావాదేవీలు జరిగేందుకు వీలు కాదు. బ్యాంకు అకౌంట్‌ తెరిచి నుంచి లావాదేవీలు నిర్వహించే వరకు అన్నింటికి పాన్‌ తప్పనిసరి. ప్రస్తుతం ఈ పాన్‌ కార్డు (PAN Card) ఆధార్‌ (Aadhaar Card)తో అనుసంధానించుకోవాల్సి ఉంటుంది. ఆధార్‌తో లింక్‌ చేయడం అనేది 30 సెప్టెంబర్‌ 2021 వరకు గడువు ఉన్నప్పటికీ, ప్రభుత్వం దానిని ఈ ఏడాది మార్చి 31 వరకు పొడిగించింది. ఈ గడువులోగా పాన్‌కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఇలా లింక్‌ చేయకపోతే రూ.10వేల జరిమానా చెల్లించుకోవాల్సి ఉంటుందని అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. అందుకే నిర్లక్ష్యం చేయకుండా పాన్‌ను ఆధార్‌తో లింక్‌ చేసుకోలేని వారు ఈ నెలాఖరులోగా ఈ పని పూర్తి చేసుకోవడం బెటర్‌. పాన్‌కార్డు ద్వారా ఎవరు ఎటువంటి లావాదేవీలు చేస్తున్నారో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారుల వద్ద పూర్తి డేటా ఉంటుంది. కొందరు రెండు పాన్‌ కార్డులు తీసుకుని మిస్‌ యూజ్‌ చేస్తుంటారు ఇలా రెండు పాన్ కార్డులు తీసుకోవ‌డం అనేది చట్టరిత్యా నేరం. ఒకవేళ రెండు పాన్‌ కార్డులు ఉండి అధికారులకు దొరికిపోయినట్లయితే రూ.10 వేల జరిమానా కట్టాల్సి ఉంటుంది.

రెండు పాన్ కార్డులు ఉంటే..

ఇలా రెండు పాన్‌కార్డులు ఉంటే జరిమానాతో పాటు బ్యాంకు ఖాతాలను సైతం స్తంభింపజేస్తారు. ఇలా రెండు పాన్‌ కార్డు కలిగిన వాళ్లు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ యాక్ట్ 1961 కింద‌ సెక్షన్‌ 272బీ ప్రకారం.. ఇన్‌క‌మ్ ట్యాక్స్ అధికారుల‌కు దాన్ని తిరిగి ఇచ్చేయవచ్చు. అలా ఇచ్చేయకుండా తమ దగ్గరే పెట్టుకుంటే మాత్రం అధికారులు చర్యలు తీసుకుంటారు.

ఇలా రెండు పాన్‌ కార్డులు ఉన్నవాళ్లు. ఏదైనా ఎన్‌ఎస్‌డీఎల్‌ కార్యాలయంలో పాన్‌ కార్డును రిటర్న్‌ చేయవచ్చు. దానికంటే ముందు పాన్‌ కార్డు అఫిషియ‌ల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఓ ఫామ్ నింపాల్సి ఉంటుంది. ఇలా ఒకటి కంటే ఎక్కువ పాన్‌ కార్డులు కలిగి ఉంటే చట్టపరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ పాన్‌ కార్డులు కలిగిన వారిపై ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారులు ప్రత్యేక నిఘా పెడుతున్నారు.

పాన్ కార్డును ఆధార్ కార్డుతో ఎలా లింక్ చేయాలి

☛ పాన్ కార్డును ఆధార్ కార్డుతో కేవలం 2 నిమిషాల్లో లింక్ చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఆధార్, పాన్ కార్డులలో మీ పేరు, పుట్టినతేదీలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి.

☛ ఆ తర్వాత ఇన్‏కమ్ ట్యాక్స్ వెబ్‏సైట్ పై క్లిక్ చేయాలి.

☛ ఆ తర్వాత హోం పేజీలో పాన్ కార్డు, ఆధార్ కార్డ్ నంబర్లు, ఆధార్ కార్డ్ మీద ఉన్న పేరు ఇవ్వాలి.

☛ ఆ తర్వాత ఐ అగ్రీ టు వాలిడేట్ మై ఆధార్ డీటేయిల్స్ విత్ UIDAI చెక్ బటన్ మీద్ క్లిక్ చేయాలి.

☛ దాని కింద చూపిస్తున్న క్యాప్చా కోడ్ సరిగ్గా టైప్ చేసి లింక్ ఆధార్ మీద క్లిక్ చేయాలి.

☛ అంతే క్షణాల్లో మీ ఆధార్, పాన్ కార్డులు అనుసంధానం అవుతాయి.

SMS ద్వారా లింక్ చేయడం ఎలా..

☛ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 567678 లేదా 56161 కు SMS చేయాలి.

☛ ఇలా చేసేందుకు మీరు మీ మొబైల్‌లో యుఐడిపిఎన్ UIDAI (12 అంకెల ఆధార్ నంబర్) (10 అంకెల పాన్) అని టైప్ చేసి 567678 లేదా 56161 కు పంపాలి.

ఇన్‌కమింగ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ ఆధార్, పాన్ కార్డుల అనుసంధానం..

☛ ముందుగా ఇన్‌కమింగ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ యొక్క ఇ-ఫైలింగ్ పోర్టల్‌ను ఓపెన్ చేయాలి.

☛ ఆ తర్వాత ఎడమ వైపున ఉన్న లింక్ బేస్ విభాగంపై క్లిక్ చేయాలి.

☛ ఆ తర్వాత మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్‌తోపాటు పేరు ఫిల్ చేయాలి.

☛ ఆ తర్వాత ‘లింక్ ఆధార్’ ఎంపికపై క్లిక్ చేయాలి. మీ పాన్ ఆధార్ లింకింగ్ పూర్తవుతుంది.

☛ మీ ఆధార్ వివరాలకు వ్యతిరేకంగా, ఐటి విభాగం మీ పేరు, పుట్టిన తేదీతోపాటు లింగాన్ని ధృవీకరిస్తుంది. ఆ తరువాత లింక్ చేయబడుతుంది.

ఇవి కూడా చదవండి:

Indian Railway: ప్రయాణికుల కోసం ఇండియన్‌ రైల్వే కీలక నిర్ణయం.. ఇక నుంచి మరింత ఆదాయం

News Papers: వార్తా పత్రికలు కాలక్రమేణా పసుపు రంగులోకి ఎందుకు మారుతాయి? కారణం ఇదే

ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా..
వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా..
LSG vs RCB: బెంగళూరుతో పోరుకు ముందు లక్నోకు మొదలైన 'బెంగ'..
LSG vs RCB: బెంగళూరుతో పోరుకు ముందు లక్నోకు మొదలైన 'బెంగ'..
లోక్ సభ ఎన్నికలకు ప్రారంభమైన పోలింగ్.. ఓటు వేసిన ప్రముఖులు..
లోక్ సభ ఎన్నికలకు ప్రారంభమైన పోలింగ్.. ఓటు వేసిన ప్రముఖులు..
మధుమేహులకు మోదుగ పూలతో వైద్యం..! మందు లేకుండా షుగర్‌ కంట్రోల్‌..!
మధుమేహులకు మోదుగ పూలతో వైద్యం..! మందు లేకుండా షుగర్‌ కంట్రోల్‌..!
కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్
కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్
సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.
సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.
బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు..
బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!