- Telugu News Photo Gallery Science photos Why Newspapers Turn Yellow Over Time know the science behind it
News Papers: వార్తా పత్రికలు కాలక్రమేణా పసుపు రంగులోకి ఎందుకు మారుతాయి? కారణం ఇదే
News Papers: మీరు ప్రతిరోజూ మీరు వార్తాపత్రికలు చదువుంటారు. కానీ మీరు ఉదయం వార్తాపత్రికను తీసుకున్న తర్వాత అది తెల్లగా కనిపిస్తుంటుంది. కానీ రోజులు గడిచిన తర్వాత ..
Updated on: Mar 13, 2022 | 2:33 PM

News Papers: మీరు ప్రతిరోజూ మీరు వార్తాపత్రికలు చదువుంటారు. కానీ మీరు ఉదయం వార్తాపత్రికను తీసుకున్న తర్వాత అది తెల్లగా కనిపిస్తుంటుంది. కానీ రోజులు గడిచిన తర్వాత కాగితం రంగు మారుతుంటుంది. రోజు గడిచేకొద్దీ దాని కాగితం రంగు పసుపు రంగులోకి మారుతుంది. ఇది వార్తాపత్రికలతో మాత్రమే కాదు.. పుస్తకాలలో కూడా జరుగుతుంది. నెలలు, సంవత్సరాలు గడిచేకొద్దీ వాటి రంగు కూడా పసుపు రంగులోకి మారుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోండి.

ఎర్త్‌స్కీ నివేదిక ప్రకారం.. కాగితం చెక్కతో తయారు చేయబడింది. చెక్కలో రెండు రకాల మూలకాలు ఉన్నాయి. సెల్యులోజ్, లిగ్నిన్. దాని ప్రభావం కారణంగా కాగితం రంగు మారుతుంది.

కాగితంలో ఉండే లిగ్నిన్ కణాలు గాలి, సూర్యకాంతి తాకినప్పుడు ప్రతిస్పందిస్తాయి. దీనినే ఆక్సీకరణం అంటారు. ఈ సమయంలో లిగ్నిన్ కణాలు పెద్ద పరిమాణంలో సూర్య కిరణాలను గ్రహిస్తాయి. కిరణాలను ఎక్కువగా గ్రహించడం జరుగుతుంది. దంతో కాగితం రంగు ముదురు అవుతుంది

ఇంట్లోని వార్తాపత్రికతో పోలిస్తే.. వార్తాపత్రిక తెరిచి ఉంచిన సాయంత్రం పసుపు లేదా గోధుమ రంగులో కనిపించడానికి ఇదే కారణం. అన్ని రకాల కాగితాలలో కలపను ఉపయోగిచినా.. అన్ని పేపర్లు ఎందుకు పసుపు రంగులో ఉండవు అనే ప్రశ్న తలెత్తుతుంటుంది.

మరికొన్ని రకాల పేపర్లు అంత త్వరగా రంగు మారవని నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణం కూడా ఉంది. ఖరీదైన కాగితాలలో ఈ చర్య చాలా నెమ్మదిగా జరుగుతుంది ఎందుకంటే కాగితం తయారైన తర్వాత లిగ్నిన్ కాగితం నుంచి తీసివేయబడుతుంది. అందుకే కాగితంలో లిగ్నిన్ లేనట్లయితే సూర్యకాంతితో ఎటువంటి ప్రతిచర్య ఉండదు. ఫలితంగా ఆ కాగితం పసుపు రంగులోకి మారదు.




