EPFO: ఈ పొరపాట్లు చేస్తే మీ పీఎఫ్ అకౌంట్ క్లోజ్ అవుతుంది.. ఎలాగో తెలుసా..
ప్రభుత్వ.. ప్రైవేటు ఉద్యోగాలకు చేసేవారికి పీఎఫ్ అకౌంట్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ప్రతినెల తమ నెలసరి జీతంలో నుంచి కొద్ది మొత్తంలో
ప్రభుత్వ.. ప్రైవేటు ఉద్యోగాలకు చేసేవారికి పీఎఫ్ అకౌంట్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ప్రతినెల తమ నెలసరి జీతంలో నుంచి కొద్ది మొత్తంలో నగదు పీఎఫ్ ఖాతాలో జమ అవుతుంటుంది. ఉద్యోగస్తులకు ఈ అకౌంట్ చాలా ముఖ్యమైనది. ఎప్పటికప్పుడు పీఎఫ్ ఖాతాలో ఉన్న నగదు గురించి తెలుసుకుంటుండాలి. పీఎఫ్ ఖాతాలో జమ అయ్యే నగదు.. రిటైర్మెంట్ తర్వాత వేతన జీవులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఎంతో ముఖ్యమైన పీఎఫ్ అకౌంట్ గురించి ప్రతి చిన్న విషయం తెలుసుకోవాలి. అలాగే పీఎఫ్ ఖాతా రూల్స్ పై కూడా అవగాహన ఉండాలి. లేదంటే మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన పీఎఫ్ ఖాతా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది.
సాధారణంగా మనం ఉద్యోగం చేసే కంపెనీ మారినప్పుడు పీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒకవేళ చేసుకోకపోయినా.. ఆ ఖాతా నుంచి లావాదేవీలు 36 నెలలపాటు జరగకపోతే అకౌంట్ క్లోజ్ అవుతుంది. అలాంటి ఖాతాలను ఈపీఎఫ్ఓ ఇన్ఆపరేటివ్ అకౌంట్ల కేటగిరిలో పెడతారు. అలాగే… కొన్ని సందర్భాల్లో పాత కంపెనీ నుంచి కొత్త కంపెనీకి పీఎఫ్ అకౌంట్ మార్చడంలో చేసే పొరపాట్ల వరల ఆ అకౌంట్స్ ఇన్ఆపరేటివ్ ఖాతాలో పడే అవకాశం ఉంటుంది. అయితే అలా ఇన్ఆపరేటివ్ అయిన ఖాతా నుంచి ఎలాంటి లావాదేవీలు చేయడానికి వీలుండదు. మళ్లీ అకౌంట్ యాక్టివేట్ చేసుకోవాలంటే ఈపీఎఫ్ఓలో దరఖాస్తు చేసుకోవాలి. అకౌంట్ ఇన్ఆపరేటివ్ గా ఉన్నప్పటికీ.. మీ అకౌంట్లోకి వడ్డీ డబ్బులు పడతాయి. అంతకుముందు ఈ ఖాతాలకు ఈపీఎఫ్ఓ వడ్డీలు ఇచ్చేది కాదు. కానీ 2016లో నిబంధనలను సవరించిన తర్వాత వడ్డీని ఇవ్వడం ప్రారంభించింది. పీఎఫ్ అకౌంట్స్ విషయంలో జరిగే మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఈపీఎఫ్ఓ సోషల్ మీడియా ద్వారా సూచించింది. ఇన్ఆపరేటివ్ అకౌంట్లకు చెందిన క్లయిమ్స్ పరిష్కరించేందుకు సరైన వ్యక్తులను ఎంచుకోవాలని తెలిపింది. ఈ ఖాతాలకు చెందిన క్లయిమ్స్ ను సెటిల్ చేసే ్ముందు ఉద్యోగికి చెందిన కంపెనీ ఆ క్లయిమ్ ను సర్టిఫై చేయాలి.
ఒకవేళ కంపెనీ క్లోజ్ అయితే.. ఈ క్లయిమ్ కు ఎవరు సర్టిఫై చేయాల్సినవసరం లేదు. ఇలాంటి క్లైయిమ్స్ కు కేవైసీ డ్యాక్యుమెంట్లను ఆధారంగా చేసుకుని బ్యాంకులే సర్టిఫై చేస్తాయి. పీఎఫ్ ఖాతా ఇన్ఆఫరేటివ్ నుంచి క్లయిమ్ చేయడానికి.. లేదా రీఓపెన్ చేయడానికి పాన్ కార్డు.. ఓటర్ కార్డు.. ఆధార్ కార్డు.. పాస్ పోర్ట్.. రేషన్ కార్డు..ఈఎస్ఐ ఐడీ కార్డు.. ఐడెంటిటీ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ కావాల్సి ఉంటుంది. అయితే మీరు ఇన్ఆపరేటివ్ అకౌంట్ నుంచి నగదు విత్ డ్రా చేసుకోవాలంటే ముందుగా పీఎఫ్ అధికారుల పర్మిషన్ తీసుకోవాలి.
Also Read: Rashmika Mandanna: సమంత బాటలో నడవనున్న రష్మిక.? బీటౌన్‌లో చక్కర్లు కొడుతోన్న క్రేజీ న్యూస్..
Telugu Indian Idol: తెలుగు ఇండియన్ ఐడల్ ఎపిసోడ్ 6.. టాప్- 12 కంటెస్టెంట్లు ఎవరంటే..
Naga Babu: ఇకపై నా పూర్తి సమయాన్ని అందుకే వినియోగిస్తాను.. నెట్టింట్లో వైరలవుతోన్న నాగబాబు పోస్ట్..