AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telugu Indian Idol: తెలుగు ఇండియన్ ఐడల్ ఎపిసోడ్ 6.. టాప్‌- 12 కంటెస్టెంట్లు ఎవరంటే..

ఇండియన్ ఐడల్ (Indian Idol).. యువ గాయనీ గాయకులను వెలుగులోకి తెస్తోన్న ఈషోకు ఉన్న ప్రేక్షకాదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హిందీలో ఈషో ఇప్పటివరకు పన్నెండు సీజన్లు పూర్తిచేసుకుంది

Telugu Indian Idol: తెలుగు ఇండియన్ ఐడల్ ఎపిసోడ్ 6.. టాప్‌- 12 కంటెస్టెంట్లు ఎవరంటే..
Indian Idol
Basha Shek
|

Updated on: Mar 13, 2022 | 12:49 PM

Share

ఇండియన్ ఐడల్ (Indian Idol).. యువ గాయనీ గాయకులను వెలుగులోకి తెస్తోన్న ఈషోకు ఉన్న ప్రేక్షకాదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హిందీలో ఈషో ఇప్పటివరకు పన్నెండు సీజన్లు పూర్తిచేసుకుంది. కాగా ఇలాంటి సింగింగ్‌ కాంపిటీషన్‌ షోనూ తెలుగు ప్రేక్షకులకూ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా (Aha). తెలుగు ఇండియన్ ఐడల్ షో (Telugu Indian Idol) పేరుతో ఓ మ్యూజిక్‌ కాంపిటీషన్‌ షోను సక్సెస్‌ఫుల్‌గా రన్‌ చేస్తోంది. గతంలో ఇండియన్‌ ఐడల్‌గా నిలిచిన ప్రముఖ సింగర్‌ శ్రీరామచంద్ర ఈ షోను హోస్ట్‌ చేస్తుండగా తమన్, నిత్యా మీనన్, కార్తీక్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. గాయనీ గాయకుల మధురమైన పాటలు, జడ్జీల కామెడీ, పంచ్‌ డైలాగులతో ఎంతో ఆహ్లాదకరంగా ఈ కార్యక్రమం సాగుతోంది. కాగా ఇప్పటికే ఐదు ఎపిసోడ్‌లు విజయవంతంగా పూర్తి చేసుకుంది తెలుగు ఇండియన్‌ ఐడల్‌ షో ప్రస్తుతం ఆరో ఎపిసోడ్‌ కొనసాగుతోంది. ఇక శనివారం రాత్రి థియేటర్‌ రౌండ్‌ ప్రసారమైంది. ఇందులో భాగంగా మొత్తం 12 మంది కంటెస్టెంట్లను తదుపరి రౌండ్‌కు ఎంపికచేశారు జడ్జీలు. మరి ఆ తాజా ఎపిసోడ్ అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం.

గోల్డెన్ మైక్ ఎవరు అందుకున్నారంటే..

కాగా తాజా ఎపిసోడ్‌లో తిరుపతికి చెందిన మాన్య శ్యామ్‌సింగరాయ్‌ సినిమాలోని ప్రణవాలయ పాటను అద్భుతంగా ఆలపించింది. వకీల్‌సాబ్‌లోని మగువా మగువా పాటను జస్కరన్‌ పాడగా, అతడు సినిమాలోని పిల్లగాలి అల్లరి పాట పాడి న్యాయనిర్ణేతలను మెప్పించింది. ఆ తర్వాత తిరుపతికే చెందిన రేణు కృష్ణార్జున యుద్ధం సినిమా నుంచి దారి చూపు మామా పాటను పాడింది. ఇక పెద్ద పల్లికి చెందిన జయంత్‌ గ్రీకువీరుడు సినిమాలోని ఓ నాడు వాషింగ్‌టన్‌ సాంగ్‌తో.. కొత్తగూడెంకు చెందిన లక్ష్మీ శ్రావణి ఆట సినిమాలోని యేలే యేలే పాటతో జడ్జీలతో పాటు ప్రేక్షకులను మెప్పించారు. ఇక చివరిలో సఖి సినిమాలోని స్నేహితుడా పాటను ఆలపించి మెప్పించింది వైష్ణవి. కాగా శుక్రవారం ఎపిసోడ్‌లో శ్రీనివాస్‌, వాగ్దేవి గోల్డెన్‌ మైక్‌ అందుకోగా, శనివారం నాటి ఎపిసోడ్ లో ప్రణతి, లక్ష్మీ శ్రావణి ఈ అవకాశం దక్కించుకున్నారు.

 స్పెషల్ అట్రాక్షన్‌ గా రామ్‌ మిరియాల.. కాగా తర్వాతి ఎపిసోడ్‌లో ప్రముఖ సింగర్‌ రామ్ మిరియాల షోలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి విడుదలైన ప్రోమో ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులో భాగంగా భీమ్లానాయక్‌ సినిమాలోని లాలా భీమ్లా పాటను ఆలపించి ఉత్సాహ పరిచాడు రామ్‌.

Also Read:CWC meet: హాట్‌హాట్‌గా సీడబ్యూసీ సమావేశం.. నాయకత్వ మార్పును కోరుతున్న జీ-23 నేతలు

ICMR Recruitment: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎపిడెమాలజీలో ఉద్యోగాలు.. నెలకు రూ. 70 వేలు జీతం..

Viral Photo: ఇంత చిన్న వయసులోనే అంత అటిట్యూడ్‌ చూపిస్తున్న.. ఈ కుర్రాడు ఎవరో చెప్పుకోండి చూద్దాం.!