ICMR Recruitment: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీలో ఉద్యోగాలు.. నెలకు రూ. 70 వేలు జీతం..
ICMR Recruitment: ఐసీఎంఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ (NIE) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకి చెందిన ఈ సంస్థ చెన్నైలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.?
ICMR Recruitment: ఐసీఎంఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ (NIE) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకి చెందిన ఈ సంస్థ చెన్నైలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయునన్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 07 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ప్రాజెక్ట్ సైంటిస్ట్ సి, కన్సల్టెంట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్-సి, సైంటిస్ట్-డి, సీనియర్ రిసెర్చ్ ఫశ్రీలో (ఎస్‌ఆర్‌ఎఫ్) పోస్టులను భర్తీ చేయనున్నారు.
* మెడికల్, నాన్ – మెడికల్, డేటా అనలిస్ట్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ, ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం తప్పనిసరి.
* అభ్యర్థుల వయసు 40 నుంచి 70 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులను nieprojectcell@nienimr.org.in ఐడీకి పంపించాలి.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 44,450 నుంచి రూ. 70,000 వరకు చెల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 28-03-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Kurnool: సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చిందని మనస్తాపం.. ఆత్మహత్య చేసుకున్న అభిమాని..