Insurance policy: గృహిణులకు ప్రత్యేక ఇన్సూరెన్స్ పాలసీ.. ఈ భీమా పొందాలంటే ఎం కావాలో ఈ వీడియోలో చూడండి..

ఇప్పటివరకూ గృహిణులకు ప్రత్యేక బీమా అనేది అస్సలు లేదు. కానీ ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. పాలసీబజార్‌తో కలిసి మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ.. మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ సెక్యూర్ ప్లస్‌ అనే కొత్త బీమా పాలసీని ప్రకటించింది. గృహిణులకోసం దేశంలో మొదటిసారి మహిళలకోసం ప్రవేశపెట్టిన జీవిత బీమా పథకం.

Insurance policy: గృహిణులకు ప్రత్యేక ఇన్సూరెన్స్ పాలసీ.. ఈ భీమా పొందాలంటే ఎం కావాలో ఈ వీడియోలో చూడండి..

|

Updated on: Mar 13, 2022 | 9:53 AM


Special insurance policy for housewives: ఇప్పటివరకూ గృహిణులకు ప్రత్యేక బీమా అనేది అస్సలు లేదు. కానీ ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. పాలసీబజార్‌తో కలిసి మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ.. మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ సెక్యూర్ ప్లస్‌ అనే కొత్త బీమా పాలసీని ప్రకటించింది. గృహిణులకోసం దేశంలో మొదటిసారి మహిళలకోసం ప్రవేశపెట్టిన జీవిత బీమా పథకం. ఇప్పటి వరకు గృహిణుల జీవిత బీమా భర్తకు కూడా వర్తిస్తుంది. చాలా బీమా కంపెనీల్లో భర్త బీమా కవరేజీలో భార్యలకు 50 శాతం మాత్రమే లభిస్తోంది. భర్తకు వచ్చే ఆదాయం పెద్దగా లేకుంటే తక్కువ ఖర్చుతో కూడిన కవర్‌ తీసుకుంటే అందులో సగం మొత్తాన్ని భార్యకు అందజేస్తారు. చిన్న కవర్‌తో బీమా ఎంపిక అందుబాటులో లేదు. ఒక వ్యక్తి వార్షిక ఆదాయం 5 లక్షల రూపాయలు అయితే.. అతని ఆదాయానికి 20 రెట్లు బీమా కవరేజ్ పొందవచ్చు. ఒకవేళ భర్త కోటి రూపాయల కవర్ పాలసీ తీసుకుంటే.. భార్యకు అసలు బీమా మొత్తం మిగలదు. ఒకవేళ భర్త కోటి కంటే తక్కువ 75 లక్షల రూపాయల బీమా కవర్‌ భర్త తీసుకుంటే.. అప్పుడు భార్య దాదాపు 25 లక్షల రూపాయల వరకు బీమాను పొందవచ్చు. కానీ ప్రస్తుతం మార్కెట్ లో 25 లక్షల రూపాయల మెుత్తానికి కవరేజ్ అందించే ఇన్సూరెన్స్ ఉత్పత్తులు అందుబాటులో లేవు.మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ సెక్యూర్ ప్లస్‌ ప్లాన్ జీవిత భాగస్వామికి పాలసీ ఉందా లేదా అనే దానితో సంబంధం లేకుండా గృహిణులకు ప్రత్యేక టర్మ్ కవరేజ్ పాలసీలను అందిస్తోంది. ఈ పాలసీ కింద గృహిణులకు 49.99 లక్షల రూపాయల వరకు పాలసీని ఇస్తుంది. బీమాదారుని వయసు, బీమా కాల వ్యవధిని బట్టి చెల్లించవలసిన ప్రీమియం 10 వేల నుంచి 12 వేల మధ్య ప్రారంభమౌతుంది. కరోనా సమయంలో చాలా కుటుంబాలు వారి ఇంట్లో గృహిణులను కోల్పోయాయి. దాని కారణంగా వారి కుటుంబాలు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాయని పాలసీ బజార్ సంస్థ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ హెడ్ ప్రవీణ్ చౌదరి అన్నారు. గృహిణులకు బీమా కవరేజ్ చాలా బాగుంది. కానీ.. ఈ బీమా పాలసీలోని రెండు ముఖ్యమైన షరతులు దానిని ఎక్కవ మందికి అందకుండా చేస్తున్నాయి. అవేమిటంటే.. గృహిణి తప్పనిసరిగా గ్రాడ్యుయేట్ అయి ఉండాలనేది మొదటి షరతు, రెండో షరతు కుటుంబ వార్షికాదాయం 5 లక్షల రూపాయలకు పైబడి ఉంటేనే ఈ బీమా సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. అంటే.. తక్కువ చదువుకున్న గృహిణులు, తక్కువ ఆదాయ కుటుంబాలు ఈ బీమా పరిధిలోకి రావు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Viral Video: రష్యా సైనికులకు ఓ ‘మోడల్‌’ ఆఫర్‌.. పుతిన్‌ను ఎదిరించిన వారికి పడక సుఖాన్ని అందిస్తా..! (వీడియో)

Prabhas-Radhe Shyam: ‘యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్’ ఫ్యాన్స్.. ‘రాధేశ్యామ్’ నుంచి డార్లింగ్ హై క్వాలిటీ ఫొటోస్ మీ కోసం..

Varsha Bollamma: పాప ఎక్స్‌ప్రెషన్స్‌‌కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..! కుర్రోళ్లకు కునుకు లేకుండా చేస్తున్న ‘వర్ష’ క్యూట్ ఫొటోస్..

Ashika Ranganath: కన్నడ ఇండస్ట్రీను షేక్ చేసి టాలీవుడ్ ఎంట్రీకు సిద్హమవుతున్న ‘అషికా రంగనాధ్’.. ఎట్రాక్ట్ చేస్తున్న ఫొటోస్..

Sitara Ghattamaneni: మహేశ్ తనయ క్యూట్‌ స్టిల్స్‌.. అప్పుడే యాక్టింగ్‌ మొదలెట్టిందా..!

Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్‌ ఇంత అందమా..! మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్..

Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…

Rana Daggubati: విభిన్న పాత్రలకి కేరాఫ్ అడ్రస్ ఆయన.. బళ్లాళ దేవ అయినా.. డానియెల్ శేఖర్ అయినా..! ట్రెండ్ మార్చిన ‘రానా’ ఫొటోస్

Follow us
Latest Articles
టైటానిక్‌ నటుడు 79 ఏళ్ల బెర్నార్డ్ హిల్ మృతి..
టైటానిక్‌ నటుడు 79 ఏళ్ల బెర్నార్డ్ హిల్ మృతి..
లక్నోపై ఘన విజయంతో రాజస్థాన్‌కు షాకిచ్చిన కోల్‌కతా..
లక్నోపై ఘన విజయంతో రాజస్థాన్‌కు షాకిచ్చిన కోల్‌కతా..
'12 ఎంపీలు గెలిపించండి.. రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాం'.. కేటీఆర్
'12 ఎంపీలు గెలిపించండి.. రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాం'.. కేటీఆర్
మీ ఓటు వేరొకరు వేశారా.. ఓటు హక్కు కోల్పోయినప్పుడు ఇలా చేయండి..
మీ ఓటు వేరొకరు వేశారా.. ఓటు హక్కు కోల్పోయినప్పుడు ఇలా చేయండి..
కన్నప్ప కోసం అక్షయ్‌ ఎన్ని కోట్లు అందుకుంటున్నాడో తెలుసా.?
కన్నప్ప కోసం అక్షయ్‌ ఎన్ని కోట్లు అందుకుంటున్నాడో తెలుసా.?
భలేగా ఉంది ఉపాయం..! సైకిల్‌ వాషింగ్‌ మెషిన్‌తో బట్టలు సాఫ్‌ సఫాయ్
భలేగా ఉంది ఉపాయం..! సైకిల్‌ వాషింగ్‌ మెషిన్‌తో బట్టలు సాఫ్‌ సఫాయ్
హైదరాబాద్‌తో పోరుకు సిద్ధమైన ముంబై.. విజయాలతో వీడ్కోలు పలికేనా
హైదరాబాద్‌తో పోరుకు సిద్ధమైన ముంబై.. విజయాలతో వీడ్కోలు పలికేనా
ఐస్ క్రీం తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినకండి..
ఐస్ క్రీం తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినకండి..
చింతపండు బస్తాలే అనుకున్నారు.. లోపల చెక్ చేయగా...
చింతపండు బస్తాలే అనుకున్నారు.. లోపల చెక్ చేయగా...
పోలా..అదిరిపోలా..4 చక్రాలతో ఎలక్ట్రిక్ బైక్.. వీడియో చూస్తే ఫిదా
పోలా..అదిరిపోలా..4 చక్రాలతో ఎలక్ట్రిక్ బైక్.. వీడియో చూస్తే ఫిదా