Gangubai Kathiawadi: ఓటీటీలోకి అడుగుపెట్టనున్న గంగూబాయి.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియాభట్ (Alia Bhatt) ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం గంగూబాయి కతియావాడి (Gangubai Kathiawadi). అజయ్ దేవ్‌గణ్ కీలక పాత్రలో నటించారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియాభట్ (Alia Bhatt) ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం గంగూబాయి కతియావాడి (Gangubai Kathiawadi). అజయ్ దేవ్‌గణ్ కీలక పాత్రలో నటించారు. ముంబయిలోని కామాఠిపుర రాజ్యానికి గంగూబాయి మాఫియా క్వీన్‌గా ఎలా ఎదిగిందన్న కథాంశంతో ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ షో నుంచే పాజిటివ్ రివ్యూస్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను రాబడుతోంది. సినిమాలో అలియా అభినయానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. కాగా ఇప్పటికే వంద కోట్ల క్లబ్‌లో చేరిన గంగుబాయి ఇప్పుడు డిజిటల్ తెరపై తన ప్రతాపం చూపించడానికి సిద్ధమైంది. థియేటర్లలోకి వచ్చిన ఎనిమిది వారాల తర్వాత మార్చి 25 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
కాగా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు సంబంధించి నెట్‌ఫ్లిక్స్ సంస్థ గంగుబాయి మూవీ మేకర్స్ తో భారీ డీల్ కుదుర్చుకుందని సమాచారం. కాగా అలియాభట్ నటించిన పాన్ ఇండియా చిత్రం ఆర్‌ఆర్‌ఆర్ అదే రోజు మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. తారక్, రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దీంతో పాటు రణ్‌బీర్ కపూర్ సరసన బ్రహ్మస్త్ర చిత్రంలో నటిస్తోంది అలియా. వీటితో పాటు నెట్‌ఫ్లిక్స్ సంస్థ తెరకెక్కిస్తోన్న హర్ట్ ఆఫ్ స్టోన్ సినిమాతో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోందీ అందాల తార. ఇందులో వండర్‌వుమన్ గాల్‌గాడోట్ కీలక పాత్రలో పోషిస్తోంది.