Viral Photo: ఇంత చిన్న వయసులోనే అంత అటిట్యూడ్ చూపిస్తున్న.. ఈ కుర్రాడు ఎవరో చెప్పుకోండి చూద్దాం.!
Viral Photo: ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social Media) త్రోబ్యాక్ ఫోటోల హవా నడుస్తోంది. అంటే చిన్ననాటి ఫోటోలను నెట్టింట పోస్ట్ చేయడం. ఈ సరికొత్త ట్రెండ్‌కు ఆద్యం పోసింది సెలబ్రిటీలేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో సామాన్యులు సైతం పాత ఫోటో ఆల్బమ్స్‌ను..
Viral Photo: ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social Media) త్రోబ్యాక్ ఫోటోల హవా నడుస్తోంది. అంటే చిన్ననాటి ఫోటోలను నెట్టింట పోస్ట్ చేయడం. ఈ సరికొత్త ట్రెండ్‌కు ఆద్యం పోసింది సెలబ్రిటీలేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో సామాన్యులు సైతం పాత ఫోటో ఆల్బమ్స్‌ను తీసి తమ ఫోటోలను ఫోన్‌లలో బందిస్తూ సోషల్ మీడియాలో అకౌంట్స్‌లో షేర్ చేస్తున్నారు. ఇలా ఇటీవల చాలా మంది సెలబ్రిటీలు తమ పాత ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండడం సర్వసాధారణంగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా ఇలాంటి ఓ త్రో బ్యాక్ ఫోటోనే నెట్టింట వైరల్ అవుతోంది.
పైన ఫోటోలో ఉన్న కుర్రాడు భలే ఉన్నాడు కదూ.! అంత చిన్న వయసులో కాలర్ ఎగిరేస్తూ ఎంతో అటిట్యూడ్ చూపిస్తున్నాడు కదూ. ఇప్పుడు ఆ కుర్రాడు టాలీవుడ్ టాప్ యంగ్ హీరోల్లో ఒకరిగా దూసుకుపోతున్నాడు. ‘అంతరిక్షం’ హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. కంచెలను తెంపుకొని తనలోని నట విశ్వరూపాన్ని చూపించాడు.
ఫన్, ఫస్ట్రేట్ అంటూ తనలోని హ్యూమర్‌ను సైతం పరిచయం చేశాడు. ప్రస్తుతం బాక్సర్‌గా అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఆ కుర్రాడు ఎవరో మీకు ఈపాటికే తెలిసిపోయి ఉంటుంది కదూ! అవును మీరు అనుకుంటుంది నిజమే.. ఆ కుర్రాడు మరెవరో కాదు మెగా హీరో వరుణ్ తేజ్. ముకుందా సినిమాతో వెండి తెర ఎంట్రీ ఇచ్చిన వరుణ్ మెగా ఫ్యామిలీ ఇమేజ్ తనపై ఎక్కడా పడకుండా ప్రయోగాత్మక సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే పలు విజయవంతమైన సినిమాల్లో నటించిన వరుణ్ ప్రస్తుతం ఎఫ్3, గని సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. మరి ఈ రెండు చిత్రాలు వరుణ్ కెరీర్‌ను ఎలాంటి మలుపు తిప్పుతాయో చూడాలి.
View this post on Instagram
View this post on Instagram
Also Read: Loan Case: విశాల్‌కు షాక్ ఇచ్చిన మద్రాస్ హైకోర్టు.. రూ. 15 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశాలు
Gold Imports: కరోనా ముందునాటికి బంగారం దిగుమతులు.. ఎక్కడి నుంచి ఎంత బంగారం వస్తోందంటే..
Gold Imports: కరోనా ముందునాటికి బంగారం దిగుమతులు.. ఎక్కడి నుంచి ఎంత బంగారం వస్తోందంటే..