AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Loan Case: విశాల్‌కు షాక్ ఇచ్చిన మద్రాస్ హైకోర్టు.. రూ. 15 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశాలు

Loan Case: కోలీవుడ్(Kollywood) స్టార్ విశాల్​(Vishal)కు మద్రాస్​ హైకోర్టు(Madras High Court )లో చుక్కెదురైంది. మూడు వారాల్లోగా కోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ పేరిట రూ.15 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (ఎఫ్‌డీ) తెరవాలని నటుడు, నిర్మాత..

Loan Case: విశాల్‌కు షాక్ ఇచ్చిన మద్రాస్ హైకోర్టు.. రూ. 15 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశాలు
Vishal Loan Case
Surya Kala
|

Updated on: Mar 13, 2022 | 9:18 AM

Share

Loan Case: కోలీవుడ్(Kollywood) స్టార్  విశాల్​(Vishal)కు మద్రాస్​ హైకోర్టు(Madras High Court )లో చుక్కెదురైంది.  మూడు వారాల్లోగా కోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ పేరిట రూ.15 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (ఎఫ్‌డీ) తెరవాలని నటుడు, నిర్మాత విశాల్‌ను మద్రాస్‌ హైకోర్టు ఆదేశించింది. లైకా సంస్థ నుంచి తీసుకున్న రుణానికి సంబంధించి రూ.15 కోట్లు డిపాజిట్‌ చేయాలని తెలిపింది.

విశాల్ తమ దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వకుండా కొత్త సినిమా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారని లైకా సంస్థ ఆరోపించింది. అంతేకాదు తమకు విశాల్ నుంచి వడ్డీతో సహా రూ.21.69 కోట్ల రుణాన్ని రికవరీ చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ లైకా ప్రొడక్షన్ హౌస్ దాఖలు చేసిన పిటిషన్‌పై   జస్టిస్ సెంథిల్ కుమార్ రామమూర్తి ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. రూ.15 కోట్లు హైకోర్టు ప్రధాన రిజిస్ట్రార్‌ పేరున బ్యాంకులో మూడు వారాల్లో డిపాజిట్‌ చేయాలని విశాల్‌ను ఆదేశించారు. తదుపరి విచారణను ఈనెల 22వ తేదీకి వాయిదా వేశారు.

విశాల్ ఒప్పందం ప్రకారం తమ డబ్బులు ఇవ్వకుండా.. ‘వీరమే వాగై సుడుం’ సినిమా రిలీజ్ చేయడానికి శాటిలైట్‌, ఓటీటీ హక్కుల విక్రయానికి విశాల్‌ సిద్ధమయ్యారని, వాటిపై నిషేధం విధించాలని లైకా సంస్థ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారించిన జస్టిస్‌ సెంథిల్‌ కుమార్‌ రామమూర్తి..

లైకా ప్రొడక్షన్స్‌కు ప్రతివాది రూ. 21.29 కోట్ల మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని అగ్రిమెంట్‌లో ప్రాథమికంగా వెల్లడించినట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. అయితే విశాల్ మొదట రూ. 12 కోట్లు తీసుకున్నారని, తర్వాత రూ. 3 కోట్లు తీసుకున్నారని, కాబట్టి రూ. 21.29 కోట్ల క్లెయిమ్ సరైనది కాదని విశాల్ తరపు న్యాయవాది వాదించారు.

Also Read:

Neha Shetty: ‘నన్ను టిల్లు నమ్మకపోయినా.. మీ అందరూ నమ్మారు’.. ఎమోషనల్‌ పోస్ట్‌ చేసిన నేహా శెట్టి.

Kurnool: సినిమాకు మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చిందని మనస్తాపం.. ఆత్మహత్య చేసుకున్న అభిమాని..