Kurnool: సినిమాకు మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చిందని మనస్తాపం.. ఆత్మహత్య చేసుకున్న అభిమాని..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ (Radhe Shyam) సినిమా శుక్రవారం(మార్చి11న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 7 వేలకు పైగా స్క్రీన్లలో గ్రాండ్‌గా ఈ మూవీ రిలీజ్​ అయింది

Kurnool: సినిమాకు మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చిందని మనస్తాపం.. ఆత్మహత్య చేసుకున్న అభిమాని..
Follow us
Basha Shek

| Edited By: TV9 Telugu

Updated on: May 07, 2024 | 12:51 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ (Radhe Shyam) సినిమా శుక్రవారం(మార్చి11న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 7 వేలకు పైగా స్క్రీన్లలో గ్రాండ్‌గా ఈ మూవీ రిలీజ్​ అయింది. ప్రేమ‌కు, విధిరాతకు మ‌ధ్య జరిగే సంఘర్షణ నేపథ్యంలో రాధాకృష్ణ కుమార్‌ ఈ పీరియాడికల్ లవ్‌స్టోరీని తెరకెక్కించారు. ప్రభాస్ సరసన​ పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించగా.. కృష్ణంరాజు, అలనాటి అందాల తార భాగ్యశ్రీ కీలక పాత్రల్లో నటించారు. మూడేళ్ల తర్వాత ప్రభాస్‌ సినిమా విడుదల కానుండడంతో అడ్వాన్స్‌ బుకింగ్‌ బాగా జరిగింది. ఇక అంచనాలకు తగ్గట్లే మొదటిరోజే ఈ మూవీ మంచి కలెక్షన్లు రాబట్టింది. దేశవ్యాప్తంగా రూ.48 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.30 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓవర్సీస్​లోనూ మంచి కలెక్షన్స్ వచ్చాయని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.

కాగా క్లాసిక్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కిన రాధేశ్యామ్‌ సినిమాకు కొన్ని చోట్ల మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చింది. ముఖ్యంగా ఇండస్ట్రీలో మాస్‌ హీరోగా పేరున్న ప్రభాస్‌ ప్యూర్‌ లవ్‌స్టోరీ చేయడం, ఫ్యాన్స్‌ను అలరించే కమర్షియల్ అంశాలు ఏవీ లేకపోవడం ఈ సినిమాకు మెయిన్ డ్రా బ్యాక్ అని చెబుతున్నారు. ఇక సినిమా స్లోగా ఉందని చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాధేశ్యామ్‌ సినిమాకు నెగెటివ్‌ టాక్‌ వచ్చిందని ప్రభాస్‌ అభిమాని ఒకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. కర్నూలు తిలక్ నగర్ లో నివాసముండే రవితేజ (24) సినిమా బాగా లేదనే మనస్తాపంతో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వెల్డింగ్ పనులు గుచేస్తూ జీవనం సాగిస్తున్న రవి శుక్రవారం విడుదల అయిన రాధేశ్యాం సినిమా కు స్నేహితులతో కలిసి వెళ్లాడు. సినిమా పోయివచ్చిన తర్వత ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఊరికి వెళ్లిన తల్లి అతనికి ఫోన్ చేసినా తీయలేదు. శనివారం ఉదయం స్నేహి తులు, ఇంటి తలుపు తట్టినా స్పందించలేదు. వెల్డింగ్ యంత్రంతో తలుపును తొలగించి చూడగా పైకప్పునకు ఉరి వేసుకొని కనిపించాడు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధారించారు. రాధేశ్యామ్  సినిమా పెద్దగా బాగా లేదన్న బాధతోనే తన కుమారుడు ఆత్మహత్య చేసుకొన్నట్లు మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.  ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు కర్నూలు నాలుగో పట్టణ ఎస్సై రామయ్య తెలిపారు.  కాగా గతంలోనూ రాధేశ్యామ్ ఇవ్వడం లేదని కొందరు ప్రభాస్‌ అభిమానులు ఏకంగా సూసైడ్‌ నోట్లు రాసిన సంగతి తెలిసిందే.

ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
వాయుగుండం ఉగ్రరూపం..బాబోయ్.! ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు
వాయుగుండం ఉగ్రరూపం..బాబోయ్.! ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు