Gold Imports: కరోనా ముందునాటికి బంగారం దిగుమతులు.. ఎక్కడి నుంచి ఎంత బంగారం వస్తోందంటే..
Gold Imports: కరోనా సమయమైన 2019లో బంగారం దిగుమతులు 863.38 టన్నులుగా ఉంది. కానీ 2021 సంవత్సరంలో ఈ దిగుమతులు 27.66 శాతం పెరగటంతో భారత్ దిగుమతులు మునుపటి స్థాయికి చేరుకుంటున్నాయి.
Gold Imports: కరోనా సమయమైన 2019లో బంగారం దిగుమతులు 863.38 టన్నులుగా ఉంది. కానీ 2021 సంవత్సరంలో ఈ దిగుమతులు 27.66 శాతం పెరగటంతో భారత్(India Imports) మెుత్తం 1067 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది. 2020 కొవిడ్ సమయంలో ఈ దిగుమతులు కేవలం 430.11 టన్నులకు పరిమితమయ్యాయి. ప్రస్తుతం 1067 టన్నుల దిగుమతుల్లో స్విట్జర్లాండ్(Switzerland) నుంచి అత్యధికంగా 469.66 టన్నుల బంగారం దిగుమతి అయింది. దీని తర్వాత యూఏఈ నుంచి 120.16 టన్నులు, దక్షిణాఫ్రికా నుంచి 71.68 టన్నులు, గినియా నుంచి 58.72 టన్నుల బంగారాన్ని మన దేశం దిగుమతి చేసుకుంది. ప్రస్తుతం చైనాతో పాటు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం దిగుమతి దారుగా ఉంది. 2015లో 1047 టన్నులు, 2017లో 1032 టన్నుల బంగారాన్ని భారత్ దిగుమతి చేసుకుంది. ప్రస్తుతం దేశంలో బంగారానికి డిమాండ్ పెరుగుతోందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
ఇదే సమయంలో 2021లో 5,078 మిలియన్ డాలర్ల విలువైన బంగారు ఆభరణాలను భారత్ ఎగుమతి చేసింది. మన దేశంలో ఆభరణాల(Gold Ornaments) పరిశ్రమ ఎగుమతులు క్రమంగా పెరుగుతున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత బంగారు ఆభరణాల దేశీయ అమ్మకాలు సైతం పెరుగుతున్నాయి. కరోనా ఆంక్షల తీవ్రతను ప్రపంచంలోని అనేక దేశాలు తగ్గించటంతో బంగారం రవాణా మెరుగుపడిందని భారత బంగారు వ్యాపారులు చెబుతున్నారు. భారతదేశంలోని ఆభరణాల తయారీదారులు తమవద్ద బంగారం నిల్వలను తిరిగి పెంచుకోవచ్చని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. దీని కారణంగా జ్యూయలరీస్ వ్యాపారంలో ఉన్న కంపెనీల ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి..
Crude Oil: ఆయిల్ ధరలతో లాభపడనున్న ఆ వ్యాపారవేత్త.. కొత్తగా దేశంలో భారీ పెట్టుబడులు..
Industrial Productivity: 1.3 శాతం పెరిగిన ఇండస్ట్రియల్ ప్రొడక్షన్.. కొత్త ఉద్యోగాలకు అవకాశం..