AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold: అప్పుడు పెరిగిన బంగారం దిగుమతి.. ఇప్పుడు తగ్గింది.. ఎందుకంటే..

గతేడాది బంగారం దిగుమతులు( gold imports) పెరిగినట్లు కేంద్ర వాణిజ్య శాఖ పేర్కొంది. బంగారం(Gold) దిగుమతులు గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-సెప్టెంబరు మధ్య 73 శాతం పెరిగి 45.1 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.3.46 లక్షల కోట్లు)కు చేరాయని తెలిపింది...

Gold: అప్పుడు పెరిగిన బంగారం దిగుమతి.. ఇప్పుడు తగ్గింది.. ఎందుకంటే..
Gold
Srinivas Chekkilla
|

Updated on: Mar 13, 2022 | 6:15 PM

Share

గతేడాది బంగారం దిగుమతులు( gold imports) పెరిగినట్లు కేంద్ర వాణిజ్య శాఖ పేర్కొంది. బంగారం(Gold) దిగుమతులు గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-సెప్టెంబరు మధ్య 73 శాతం పెరిగి 45.1 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.3.46 లక్షల కోట్లు)కు చేరాయని తెలిపింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం అంటే 2020-21లో ఇదే సమయంలో దిగుమతుల విలువ 26.11 బిలియన్‌ డాలర్లుగా నమోదైందని చెప్పింది. దేశీయంగా గిరాకీ పుంజుకోవడమే దిగుమతులకు ప్రధాన కారణమని కేంద్ర వాణిజ్య శాఖ(Central Department of Commerce) తెలిపింది. అయితే, ఫిబ్రవరి 2022లో మాత్రం బంగారం దిగుమతులు పడిపోవడం గమనార్హం. ప్రభుత్వ లెక్కల ప్రకారం గత నెలలో దిగుమతులు 11.45 శాతం తగ్గి 4.7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.

పసిడి దిగుమతులు పెరగడంతో ఈ ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లో కరెంటు ఖాతా లోటు 176 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. క్రితం ఏడాది ఇదే సమయంలో ఈ లోటు 86 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. రానున్న పెళ్లిళ్ల సీజన్‌ నేపథ్యంలో దిగుమతులు మరింత పెరిగి కరెంటు ఖాతా లోటుపై ఇంకా ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేశారు. ప్రపంచంలో అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. ముఖ్యంగా ఆభరణాల పరిశ్రమలే ఎక్కువగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటాయి. అయితే ప్రస్తుతం బంగారం ధర పెరగడం దిగుమతిపై ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. అదే సమయంలో బంగారంపై పెట్టుబడి పెట్టడం పెరిగినట్లు చెబుతున్నారు.

Read Also.. PAN-Aadhaar: ఈ నెలాఖరులోగా ఈ పని చేయకుంటే పొరపాటు చేసినట్లే.. రూ.10 వేల జరిమానా