AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Babu: ఇకపై నా పూర్తి సమయాన్ని అందుకే వినియోగిస్తాను.. నెట్టింట్లో వైరలవుతోన్న నాగబాబు పోస్ట్‌..

మెగాస్టార్‌ చిరంజీవి సోదరుడిగానే కాకుండా నటుడు, నిర్మాతగా టాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు మెగా బ్రదర్‌ నాగబాబు (Naga Babu). ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో నటిస్తోన్న ఆయన ఎక్కువగా బుల్లితెరపైనే సందడి చేస్తున్నారు

Naga Babu: ఇకపై నా పూర్తి సమయాన్ని అందుకే వినియోగిస్తాను.. నెట్టింట్లో వైరలవుతోన్న నాగబాబు పోస్ట్‌..
Nagababu
Basha Shek
|

Updated on: Mar 13, 2022 | 10:49 AM

Share

మెగాస్టార్‌ చిరంజీవి సోదరుడిగానే కాకుండా నటుడు, నిర్మాతగా టాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు మెగా బ్రదర్‌ నాగబాబు (Naga Babu). ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో నటిస్తోన్న ఆయన ఎక్కువగా బుల్లితెరపైనే సందడి చేస్తున్నారు. టీవీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఇక రాజకీయాల్లోనూ బిజీగా ఉంటూ జనసేన పార్టీ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ సభ్యుడిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇదిలా ఉంటే నెట్టింట్లోనూ యాక్టివ్‌ ఉండేగా మెగాబ్రదర్‌ సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌లో ‘ఇన్నాళ్ల నా జీవితంలో.. ఎన్నో ఒడిదుడుకులను చూశాను. ఎన్నో విపత్తులను ఎదుర్కొని నన్ను నేనుగా మార్చుకోగలిగాను. ఒక రకంగా చూస్తే ఈ కష్టాలు, కన్నీళ్లే నన్ను ఒక పూర్తి మనిషిగా మలచడానికి ఎంతగానో సహాయపడ్డాయి. నేను పుట్టి పెరిగిన నా దేశానికి, నా ప్రజలకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నాను. అదే గమ్యంగా నా లక్ష్యం వైపు పయనం సాగించాను. ఈ పయనంలో నాకు ఎన్నో ఒడిదుడుకులు, ఆటంకాలు ఎదురైనా, కానీ.. నన్ను ప్రతిసారి వెన్నంటి నడిపించి నాకు మనిషిగా ఎదిగే అవకాశాన్ని ఇచ్చింది కూడా ఈ కష్టాలు, కన్నీళ్లే. అందుకే ఇప్పటి నుంచి నా పూర్తి సమయాన్ని నా గమ్యం చేరుకోవడానికి ఉపయోగించాలని నిర్ణయించుకున్నాను. మరిన్ని వివరాలతో త్వరలో మీ ముందుకొస్తాను.. ఎన్ని కష్టాలొచ్చినా ఈ బాటసారి ప్రయాణం కొనసాగుతుంది’ అని రాసుకొచ్చారు నాగబాబు.

కాగా సోషల్‌ మీడియాలో ఇంత పెద్ద పోస్ట్‌ పెట్టడం వెనక నాగబాబు ఆంతర్యం ఏమిటన్నది మాత్రం తెలియరావడం లేదు. సినిమాలకు సంబంధించి ఆయన ఏదైనా కీలక నిర్ణయం తీసుకోనున్నారా? మళ్లీ చిత్ర నిర్మాణం వైపు దృష్టి మరల్చబోతున్నారా? అనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. మరి త్వరలోనే నాగబాబు ఈ విషయంలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి. కాగా రేపు (మార్చి 14) మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో జనసేన ఆవిర్భావ సభ జరగనున్న సంగతి తెలిసిందే. జనసేన పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ సభ్యుడిగా సభ ఏర్పాట్లను దగ్గరుండి ఆయన పరిశీలించారు.

Also Read:Balakrishna: హైందవ సనాతన ధర్మాన్ని నిలబెట్టిన చిత్రం అఖండ.. చలన చిత్ర పరిశ్రమకు దిక్సూచి అన్న బాలయ్య

Viral Video: బాయ్‌ఫ్రెండ్‌ కోసం వెతుకుతున్న 3అడుగుల మోడల్.! కానీ ఆస్థి ఎంత అంటే..? అడ్రస్ అడుగుతున్న యువకులు..

Dog Viral Video: కుక్కకు అంతిమ సంస్కారాలు … చేసిందెవరో తెలిస్తే కన్నీళ్లు ఆగవు.. ప్రశంసలు అందుకుంటున్న వీడియో..